నాతో మాటలు ఇదే చివరిసారి అవ్వొచ్చు: ఉక్రెయిన్ అధ్యక్షుడు

యూఎస్ చట్టసభ సభ్యులకు ప్రైవేట్ వీడియో కాల్‌

Ukraine' president Volodymyr Zelenskyy
Ukraine’ president Volodymyr Zelenskyy

రష్యా సైనిక చర్యను ఎదుర్కోవడానికి మరిన్ని యుద్ధ విమానాలను పంపాలని తన దేశం మనుగడ కోసం పోరాడుతున్న ఉక్రేయన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అమెరికాను అభ్యర్థించారు . రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించాలని అమెరికాకు ఆయన విజ్ఞప్తి చేశారు. శనివారం యూఎస్ చట్టసభ సభ్యులకు ఒక ప్రైవేట్ వీడియో కాల్‌లో మాట్లాడారు .’ నాతో మీరు మాట్లాడటం ఇదే చివరిసారి కావచ్చేమో ‘ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు రాజధాని కైవ్‌లో ఉన్నారు. ఇదిలా ఉండగా , కైవ్‌ ఉత్తరాన రష్యన్ సాయుధ దళాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే .

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/