రాజ్‌ఘాట్‌లో మ‌హాత్ముడికి ప్రముఖుల నివాళి

నేడు మహాత్మాగాంధీ 152వ జయంతి
మాజీ ప్రధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి 117వ జ‌యంతి

న్యూఢిల్లీ : నేడు మహాత్మాగాంధీ 152వ జయంతి, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి 117వ జ‌యంతిసందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ , కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు.. వారి స‌మాధుల వ‌ద్ద నివాళుల‌ర్పించారు.

రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌ వద్ద రామ్‌నాథ్ కోవింద్, మోడీ , సోనియా గాంధీ.. పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం ప్ర‌కాశ్ బిర్లా, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రీ కుమారుడు అనిల్ శాస్త్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గాంధీ, శాస్త్రి సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. అనంతరం కాసేపు మౌనం పాటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/