నేడు ముచ్చింతల్‌కు వెళ్లనున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

President Draupadi Murmu will go to Muchintal today

హైదరాబాద్‌ః భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలంగాణలో పర్యటన భాగంగా గురువారం ముచ్చింతల్ లోని సమాతమూర్తి స్ఫూర్తి కేంద్రానికి సాయంత్రం 5:15 గంటలకి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకుంటారు. అనంతరం రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. తర్వాత రిఫ్రిస్మెంట్ పూర్తి చేసుకొని అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గేట్ నెంబర్ 3 వద్దకు చేరుకుంటారు. అక్కడ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి ద్రౌపతి మూర్మును వెంట తీసుకుని 108 దివ్యసాలు సందర్శిస్తూ ఆలయ విశేషాలు తెలియచేస్తారు.

ఆ తర్వాత 216 అడుగుల రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసి అక్కడనుంచి రామానుజ స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీ రామానుజ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎదురుగా ఏర్పాటుచేసిన డైనమిక్ ఫౌంటైన్ షో తిలకిస్తారు. చివరకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ త్రీడీ లేజర్ షో చూసిన తరువాత సందర్శకులని, భక్తులని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో రాష్ట్రపతి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు, సందర్శకులు పోలీసులకు, ఆలయ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/national/