మృత దేహలను 9వరకు భద్రపరచండి

telangana-high-court
telangana-high-court

హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా మానవహక్కుల సంఘాలు, మహిళ సంఘాలు స్పందిస్తున్నాయి. నిందితులు తమ నుంచి ఆయుధాల్ని గుంజుకొని ఎదురు తిరగడంతో ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్‌ చేయాల్సివచ్చిందని పోలీసులు చెప్పడాన్ని తప్పుబడుతూ పలు మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు శుక్రవారం రాత్రి హైకోర్టు పనివేళలు ముగిసాక ఫిర్యాదు చేశారు. దీన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా తీసుకుని విచారించింది. జస్టిస్‌ ఎం.ఎస్‌ రామచందర్‌రావు ఇంట్లోనే విచారించిన బెంచ్‌ ఈ నెల 9వ తేదీ రాత్రి 8 గంటలకు వరకు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంకా నిందితులు పోస్టుమార్టం వీడియో కాపీలను జిల్లా జడ్జి ద్వారా హైకోర్టుకు అందజేయాలని, ఈ కేసును ఈ నెల 9న ఉదయం పదిన్నర గంటలకు సీజే ఆధ్వర్యంలో డివిజన్‌ బెంచ్‌ విచారిస్తుందని తెలిపారు. ఇంకా చట్ట ప్రకారం నిందితులకు శిక్షలు పడేలా చేయాల్సిన పోలీసులు ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపారని సామాజిక కార్యకర్తలు విమర్శించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/