యూపిలో రేపు ఎన్నికలకు రంగం సిద్ధం

elections in UP
elections in UP


ఉత్తరప్రదేశ్‌: గురువారం నాడు రెండో దశ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. యూపిలో ఈ ఎన్నికలకు రంగం సిద్దమైంది. యూపిలో 8 స్థానాలుంటే ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీ, మధుర, హథ్రాన్‌, బులంద్‌ సహర్‌, ఆమ్రోహా, నగీనా ,అలీగఢ్‌ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కేంద్రాలకు ఈవిఎంలను పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పారా మిలిటరీ బలగాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రతను పెంచారు. మొత్తం దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్‌ జరగనుంది. ఈ రెండో విడతలో 97 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంటే..దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడులో మొత్తం 54 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. ఉత్తరాదిన 11 రాష్ట్రాల్లో 43 స్థానాలకు రేపు పోలింగ్‌ జరగుతుంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/