ముక్కు ద్వారా కరోనా టీకా..భారత్‌లో ప్రయోగాలు

వివరాలు తెలిపిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

Nasal-coronavirus-vaccine-final-trials-to-be-initiated-in-India

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ముక్కు ద్వారా ఉపయోగించే టీకా చివరిదశ ప్రయోగాలను దేశంలో భారీ స్థాయిలో చేపట్టనున్నారు. ముక్కు ద్వారా వేసే టీకాకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ప్రాథమిక దశ తర్వాతి దశ ట్రయల్స్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్‌ చేపట్టనున్నట్టు వివరించారు. డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఈ ట్రయల్స్‌కు త్వరలోనే అనుమతించనుందని తెలిపారు. కొన్ని నెలల వ్యవధిలోనే భారత్‌లో ‘ఇంట్రా నాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌’ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న మూడో దశ వ్యాక్సిన్‌ ప్రయోగాలు అన్నీ ఇంజక్షన్‌ రూపంలో ఉన్నాయని ఇటీవలే డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. అయితే, భారత్ మాత్రం ఇంట్రానాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలను చేపట్టనున్నట్టు చెప్పడం గమనార్హం. చివరిదశ ప్రయోగాలను భారత్‌లో భారీస్థాయిలో చేపట్టనున్నట్లు, 30 నుంచి 40 వేల మంది వలంటీర్లపై ప్రయోగించే అవకాశమున్నట్లు హర్షవర్ధన్ చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/