నచ్చకుంటే రెండేళ్ల తరువాత సవరణలకు సిద్ధం

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

Rajnath Singh
Rajnath Singh

New Delhi: కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఆందోళనలను సాగిస్తున్న రైతులు ఒకటి రెండేళ్ల పాటు ఆ చట్టాలను అమలు కానీయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు.

రైతులకు అనుకూలంగా చట్టాలు లేవని అప్పుడు వారికి అనిపిస్తే అవసరమైన సవరణలను కేంద్రం చేపడుతుందని ఆయన అన్నారు. 

ప్రధాని కిసాన్ సమ్మాన్ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్,  ప్రధాని మోడీ మనసు ఏమిటో బాగా తెలిసిన వ్యక్తిగా నేను చెబుతున్నారు.

చట్టాల్లో అవసరమైన అన్ని మార్పులు తప్పనిసరిగా చేస్తాం అని రాజ్‌నాథ్‌ చెప్పారు. కనీస మద్దతు ధరకు ఢోకా ఉండదని ప్రధాని భరోసా ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన పునరుద్ఘాటించారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/