కరోనా మందులు, టీకాల తయారీ వేగవంతం చేయాలి

అమెరికాలో ఒకేరోజు 68 వేల కొత్త కేసులు

bill gates
bill gates

అమెరికా: అమెరికాలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తుంది. ఈనేపథ్యంలో బైక్రో సాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ శనివారం వర్చువల్ కోవిడ్19 సమావేశంలో మాట్లాడుతూ.. కరోనావైరస్ వ్యాక్సిన్‌ను దేశాల్లో ప్రజలకు చాలా అవసరమని, దాన్ని అత్యవసరంగా అందుబాటులో ఉంచాలని ఆయన అన్నారు. మందులు, టీకాల తయారీని వేగవంతం చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఇది ఘోరమైన మహమ్మారి అని దీన్నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యాక్సిన్ కోసం అన్వేషణ, ట్రయల్స్ నడుస్తోంది.

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. నిన్న ఒకేరోజు దేశవ్యాప్తంగా 68 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 32,91,786 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,36,671 మంది బాధితులు మృతిచెందారు. గత 24 గంటల్లో 849 మంది మరణించారంటే కరోనా తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 14,60,495 మంది కోలుకోగా, 16,94,620 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/