నూతన సచివాలయానికి, శాసనసభకు నేడు భూమిపూజ

హైదరాబాద్: ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన సచివాలయ భవనం, శాసనసభ భవన సముదాయానికి గురువారం భూమి పూజ జరగనుంది. ఉదయం 10 గంటలకు సచివాలయ భవనానికి, ఉదయం 11 గంటలకు ఎర్రమంజిల్లో నిర్మించే శాసనసభ, శాసనమండలి భవన సముదాయానికి సియం కేసిఆర్ భూమి పూజ చేస్తారు. భవనాల, సాధారణ పరిపాలనా శాఖలు ఈ మేరకు ఏర్పాట్లు చేశాయి. సచివాలయంలోని డి-బ్లాకు వెనుక భాగంలో పోర్టికోకు ఎదురుగా గల చిన్న గార్డెన్లో భూమి పూజ కోసం ఏర్పాట్లు చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/ :