తేలిగ్గా కోరుకున్న మార్కులు

పరీక్షలకు ప్రిపరేషన్‌

preparation for exams
preparation for exams

పరీక్షల వేళ కష్టపడి చదవమని విద్యార్థులను అందరూ ప్రోత్సహిస్తుంటారు. దీని వల్ల బయట నుంచీ, అంతర్గతంగానూ క్రమంగా ఒత్తిడి విస్తరించే అవకాశం ఉంది. దాన్ని అధిగమించి అనుకున్న లక్ష్యం అందుకోవడానికి విద్యార్థులు తెలివిగా వ్యవహరిస్తూ సులువైన పద్ధతులు అనుసరించాలంటున్నా నిపుణులు.
నిజానికి పరీక్షలకు సిద్ధమవడం ఒక కళ. ఏడాది పాటు చదివిన దాన్ని కొన్ని వారాల పరిధిలో కవర్‌ చేయాలి. సమర్థంగా పూర్తి చేసిన వాళ్లే మంచి స్కోరు సాధిం చగలుగుతారు. మొదటి నుంచీ చదవలేదే అని ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఉండదు. ఉన్న సమయాన్ని సరిగా ఉపయోగించు కోవడానికి ప్రయత్నించాలి. అందుకు కష్టంగా, బల వంతంగా చదవడం పరిష్కారం కాదు. గంటలు.. గంటలు గడిపితే!
పరీక్షలు కొద్ది రోజుల్లో ఉన్నాయంటే కొందరు 24 గంటలూ పుస్తకాలతోనే గడుపుతుంటారు. నైట్‌ అవుట్‌ల పేరుతో కుస్తీలు పడుతుంటా రు. 3,4 గంటలు మాత్ర మే పడుకుని మళ్లీ చదువు తుంటారు. ఇలాంటివారిని చూసిన తల్లి దండ్రులు తమ పిల్లలపై కొంత ఒత్తిడి పెడుతుంటారు. ఇలా గంటల కొద్దీ కేటాయి స్తేనే సరైన పద్ధతిలో సిద్ధమవు తున్నట్లుగా భావిస్తారు. శరీరాన్ని అంతగా శ్రమ పెడితే పరీక్ష సమయానికి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఒకరితో పోలిక పెట్టుకోకుండా విద్యార్థులు తమ శక్తిమేరకు ప్రణాళికలు వేసుకోవాలి. దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.

వచ్చినవే అని విస్మరిస్తే..

కఠినమైన అధ్యాయాలకే ప్రాధాన్యం ఇవ్వడం, వాటికే అధిక సమయం కేటాయించడం విద్యార్థులు సాధారణంగా చేసేపని. తేలికైనవి, బాగా వచ్చినవి ఎలాగూ గుర్తుంటాయనే భావనతో వాటిని విస్మరిస్తుం టారు. దీని వల్ల నష్టాలు ఉన్నాయి. కొత్తవి నేర్చుకోవడానికి తపన లో ఇది వరకు వచ్చినవాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మర్చి పోయే ప్రమాదం ఉంది. కొంత విరామం తర్వాత పూర్తిగా కాకపోయిని కొంతైనా మర్చి పోవడం సహజం.వచ్చిన అధ్యాయాలు చేతిలో ఉన్న డబ్బుల్లాంటివి. వాటిని జాగ్రత్త చేసుకోకుండా మిగతా వాటి కోసం ప్రయత్నిస్తే చేతిలోనివి చేజారిపోయే అవకాశం ఉంది. అండర్‌ లైన్‌ చేస్తున్నారా? పరీక్షలో ముఖ్యమైన పాయింట్లను హైలైట్‌చేయడానికి చాలా మంది అండర్‌లైన్‌ చేస్తుంటారు. అది ఎగ్జామినర్‌ దృష్టిలో పడాలనే అలా చేస్తారు. సన్నద్ధత సమయంలోనూ అదే చేయవచ్చు.

భాషాశాస్త్రాలూ ముఖ్యమే..

సాధారణంగా పదో తరగతి విద్యార్థులు మ్యాథ్స్‌ లేదా సైన్స్‌, ఇంటర్మీడియట్‌ అభ్యర్థులు గ్రూప్‌ సబ్జెక్టులపై ప్రధానంగా దృష్టిపెట్టి చదువుతుం టారు. తెలుగు/సంస్కృతం, ఇంగ్లిష్‌ సబ్జెక్టులను పరీక్ష ముందు కొద్దిరోజులు చదివితే సరిపోతుందని భావిస్తారు. పదో తరగతితో పోలిస్తే ఇంటర్‌ విద్యార్థుల్లో ఈ అభిప్రాయం ఎక్వుకగా వ్యక్తమవుతుంటుంది. కొత్తవి వద్దు: పరీక్షలనగానే చాలా మంది అప్పటివరకూ ఊచూడని గైడ్‌లు, వేరే మెటీరి యల్స్‌ సేకరించి చదివేస్తుంటారు. దీని వల్ల కొంత గందర గోళం ఏర్పడే అవకాశం ఉంది. ప్రయోజనమూ తక్కువే. అందుకే మొదటి నుంచీ అనుసరిస్తున్న పుస్తకం/ మెటీరి యల్‌నే కొనసాగించడం మంచింది. పాయింట్లుగా ముఖ్యాంశాలు: ప్రతి చాప్టర్‌కి సంబం ధించిన ముఖ్యాంశాలను చదువుతున్న ప్పుడే చిన్న పాయింట్ల రూపంలో రాసిపెట్టుకోవాలి. అన్ని సబ్జెక్టులకీ విడివిడిగా చేయాలి. పాయింటుగా మాత్రమే రాయాలి. మళ్లీ మొత్తం రాసుకోకూడదు. చిన్న పాయింటర్లు, చిన్న మ్యాప్‌లు, బొమ్మలు లేదా సబ్‌ హెడ్డింగ్స్‌, కీవర్డ్స్‌లా రాసు కోవాలి. చూడగానే మొత్తం గుర్తుకురావాలి. పరీక్ష ముం దు సులువుగా పునశ్చరణకు వీలుగా ఉండాలి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మాథ్య్‌ ఫార్ములాలనూ జాబితాగా రాసుకోవాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/