అమెరికాలో స్టోర్స్‌ను ప్రారంభించిన మిల్క్‌ షేక్స్‌

milk shakes
milk shakes

ప్రముఖ మిల్క్‌ ఉత్పత్తుల సంస్థ మిల్క్‌షేక్స్‌ అమెరికా మార్కెట్లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ మిల్క్‌షేక్స్‌ ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలోని తన తొలి స్టోర్‌ని ప్రారంభించింది. మిల్క్‌ షేక్స్‌ వ్యవస్థాపకులు రాహల్‌ తిరుమలప్రగడ మాట్లాడుతూ..ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 80 స్టోర్లను రన్‌ చేస్తున్న సంస్థ వచ్చే నెల చివరి నాటికి 100కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. గతేడాది రూ.25 కోట్లుగా ఉన్న టర్నోవర్‌ ఈసారి రూ. 40 కోట్లకు చేరుకోనున్నదన్నారు.