నాగ చైతన్య మూవీ నుండి కార్తీకదీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ లుక్ రిలీజ్

బుల్లితెర క్వీన్ ..కార్తీకదీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ ఇప్పుడు వెండితెర ఫై సందడి చేసేందుకు సిద్ధమైంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న మూవీ లో ఈమె కీలక రోల్ చేస్తుంది. ఈమె తాలూకా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ శుక్రవారం రిలీజ్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు. నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో NC22 పేరిట ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ లో ప్రియమణి తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ తరుణంలో వారి పాత్రల తాలూకా ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేస్తూ సినిమా ఫై ఆసక్తి నింపుతున్నారు. ఇప్పటికే పలువురి ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేసిన మేకర్స్..శుక్రవారం కార్తీకదీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న వర్సటైల్ యాక్టర్ సంపత్ రాజ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు చిత్ర బృందం వెల్లడించింది. అలానే ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటుడు అరవింద్ స్వామి NC22 సినిమాలో మెయిన్ విలన్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘ధృవ’ మూవీ తర్వాత ‘రోజా’ హీరో తెలుగులో విలన్ గా నటించే సినిమా ఇదే అవుతుంది. ‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తమిళ హీరో జీవా కూడా నాగచైతన్య సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైసూర్ షెడ్యూల్ లో జీవా పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.