ప్రేమదేశం ఫేమ్ అబ్బాస్ కు ప్రమాదం

ప్రేమదేశం ఫేమ్ అబ్బాస్ ప్రమాదానికి గురయ్యారు. 1996లో ప్రేమ దేశం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అబ్బాస్.. ఆ మూవీతోనే ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్నారు. మొదటి సినిమా తోనే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ప్రేమ దేశం తర్వాత తెలుగు తో పాటు తమిళ్ లో పలు విజయవంతమైన సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.

కెరియర్ సక్సెస్ గా ఉన్నటైం లోనే సినిమాలకు బై బై చెప్పారు. తన ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్‏లో స్థిరపడ్డారు. అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‎గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే చాలా కాలంగా అటు సినీ పరిశ్రమకు.. సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అబ్బాస్..తాజాగా ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో షేర్ చేసి అభిమానులకు షాకిచ్చాడు. బైక్ పై నుంచి పడి గాయపడ్డానని, కొన్నిరోజులుగా విపరీతమైన కాలి నొప్పితో బాధపడుతున్నానని వెల్లడించారు. డాక్టర్లు శస్త్రచికిత్స తప్పనిసరి అని చెప్పారని తెలిపారు. సర్జరీ అనగానే గందరగోళానికి లోనయ్యానని, అయితే సర్జరీ చేయించుకున్నాక ఎంతో ఉపశమనం పొందానని పేర్కొన్నారు. డాక్టర్లకు థాంక్స్ చెప్పుకుంటున్నాను అని వివరించారు. తెలుగులో రాజా, అనగనగా ఒక అమ్మాయి, కృష్ణ బాబు, అల్లుడుగారు వచ్చారు, మాధురి, నీ ప్రేమకై, శ్వేత నాగు, పొలిటికల్ రౌడీ, చంద్రహాస్, అనసూయ, ఇది సంగతి, బ్యాంక్, మారో, అలా జరిగింది ఒక రోజు వంటి సినిమాల్లో నటించారు అబ్బాస్.