సిక్కీం సిఎంగా ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ ప్రమాణస్వీకారం

Prem Singh Tamang
Prem Singh Tamang

హైదరాబాద్‌: క్రాంతికారి మోర్ఛా(ఎస్‌కేఎమ్‌) అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌(51) ఈరోజు సిక్కీం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పీఎస్‌ గొలయ్‌గా సుప్రసిద్ధుడైన ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ చేత గవర్నర్‌ గంగా ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. సిక్కీం క్రాంతికారి మోర్చా మద్దతు దారులు ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమాంగ్‌ నేపాలి భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈవేడుక గ్యాంగ్‌టక్‌లోని పల్జోర్‌ స్టేడియంలో జరిగింది. అయితే సిక్కీం అసెంబ్లీలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఎస్కేఎం, ఎస్డీఎఫ్‌ పార్టీల మధ్య హోరాహోరి పోరు సాగింది. గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన లెక్కింపులో ఎస్కేఎం 17 స్థానాల్లో మెజార్టీ సాధించగా.. ఎస్టీఎఫ్ 15 స్థానాలతో అధికారాన్ని కోల్పోయింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/