గర్భిణులు – పెల్విక్స్‌ లోపాలు

ఆరోగ్య భాగ్యం

గర్భిణులు - పెల్విక్స్‌ లోపాలు
Pregnant women – pelvic disorders

స్త్రీలలో పెల్విక్‌ నిర్మాణం, ఆకృతిని బట్టి గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో, ప్రసవసమయంలో అనేక మార్పులు కలుగుతాయి. దీనివల్లనే గర్భధారణలోను, ప్రసవ సమయాలలో అనేక కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. నార్మల్‌గా పెల్విక్‌ నిర్మాణ ఆకృతులు 4 రకాలుగా ఉంటాయి.
గైనకాయిడ్‌ పెల్విక్‌
ఇది చాలామంది స్త్రీలలో ఉండే పెల్విక్‌ రకం. ఇది గుండ్రంగా ఉండి ట్రాన్స్‌వర్స్‌ (ఆబ్లిక్‌) డయామీటర్స్‌ని కల్గి ఉండడం వల్ల ఫీటల్‌ తలభాగం ఎంగేజ్‌మెంట్‌కి, రొటేషన్‌కి అనువ్ఞగా ఉండి, నార్మల్‌గా కాన్పు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవ్ఞతుంది.

 • ఆండ్రాయిడ్‌ పెల్విక్‌: ఇవి మగవారిలాగా ఉండడం వల్ల కేవటీ డయామీటర్స్‌ తక్కువ్ఞగా ఉంటాయి. దీనివల్ల పీటస్‌ తల ట్రాన్స్‌వర్స్‌ (అడ్డంగా) డయామీటర్‌లో ఎంగేజ్‌ కావడం వల్ల కాన్పు కష్టమై ఇన్‌స్ట్రుమెంటల్‌ డెలీవరీ అవ్ఞతుంది.
 • ఆంత్రోపాయిడ్‌ పెల్విక్‌: కోతుల్లో లాగా ఉండే పెల్విక్‌లో ఫీటస్‌ రొటేషన్‌ కష్టం కావడం వల్ల ముఖోదయం (ఫేస్‌)తో కాన్పు అవ్ఞతుంది. అవసరాన్ని బట్టి సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది.
 • ప్లాగీపెల్లాయిడ్‌ పెల్విక్‌: ఇది అరుదుగా ఉండే పెల్విక్‌. వీరిలో పెల్విక్‌ చదరంగా ఉండి ఫీటల్‌ ఎంగేజ్‌మెంట్‌ అడ్డంగా ఉండడం వల్ల సిజేరియన్‌ అవసరమవ్ఞతుంది.
  పెల్విక్‌లోని భాగాలు: ఇది రెండు విధాలుగా ఉంటుంది.
 • ఫాల్స్‌ పెల్విక్‌: ఇది తుంటి ఎముకలతో వెనకభాగం వెన్నెముక చివరలలో ముందు అబ్దామినల్‌ గోడలతో వెనుకభాగం వెన్నెముక చివరలతో ముందు అబ్దామినల్‌ గోడలతో నిర్మితమై ఉంటుంది. ఇది ఎదిగే పిండానికి అనుగుణంగా (యూట్రస్‌) గర్భసంచికి సపోర్ట్‌గా ఉంటుంది.
 • ట్రూ పెల్విక్‌: దీనిపై భాగం కటిభాగంతో 4 సెంమీతోను, వెనుకభాగం లోతుగా వెన్నముక చివరిభాగం సాక్రమ్‌, కాక్సిస్‌ ఎముకలతో 11.5 సెం.మీ ఉంటుంది. ప్రసవానికి అనుగుణంగా దీని నిర్మాణాకృతి ఉంటుంది. ఇది స్త్రీలలో 3భాగాలుగా ఉండి ప్రసవ సమయంలో కీలక పాత్ర వహిస్తాయి.
 • ఇన్‌లెట్‌: దీన్నే బ్రిమ్‌ ఆఫ్‌ ది పెల్విక్‌ అని అంటారు. ఇది విశాలంగా గుండ్రంగా ఉండి ముందు నుంచి వెనక్కి (కటి నుండి సాక్రమ్‌ వరకు) వరకుండి ఎపి డయామీటర్‌ చిన్నగా ఉంటుంది. ఇన్‌లెట్‌ అంగిల్‌ మామూలుగా 55 డిగ్రీ వ్ఞంటుంది. రేడియో గ్రాఫికల్‌గా దీన్ని కొలచినప్పుడు 135 డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే దాన్ని హైఇన్‌క్లినేషన్‌ అంటారు. హైఇన్‌క్లినేషన్‌ వ్ఞన్నప్పుడు ఫీటల్‌ తల ఎంగేజ్‌ కావడం ఆలస్యం కావడం, బిడ్డ తల వెనుకభాగం కష్టంగా కిందికి జరగడం వ్ఞంటుంది. ప్రసవ మార్గం పొడవ్ఞగా ఉండి, సాక్రం ఎముక చదరంగా ఉండడం వల్ల బిడ్డ ఇంటర్నల్‌ రొటేషన్‌కి కష్టంగా ఉంటుంది.
 • మిడ్‌ పెల్విక్‌ లేదా కావిటీ: ఇవి విశాలంగా, గుండ్రంగా ఉండి కటి ఎముక వెనుక నుండి 2,3,సాక్రల్‌ ఎముకల వరకు విస్తరించి వ్ఞంటుంది. దీనివల్ల తల ఎంగేజ్‌మెంట్‌ సులభంగా జరుగుతుంది.ఎపి డయామీటర్‌ 12 సెం.మీ ఉంటుంది.
 • అవ్ఞట్‌లైట్‌: ఇది పెద్దగా ఉండి రెండు త్రికోణాకృతి భాగాల్ని కల్గి ఉంటుంది. ఆంటిరియార్‌ భాగం ప్యూబిక్‌ ఆర్బ్‌ కింద పోష్టిరియాక్‌ (వెనక) భాగం సాక్రం ఎముక కింద వరకు వ్ఞండడం వల్ల బిడ్డ ఇంటర్నల్‌ రొటేషన్‌కు అనువ్ఞగా వ్ఞంటుంది. గర్భధారణలో ప్రసవ సమయంలో రిలాక్సిన్‌ హార్మోన్‌ వల్ల లిగమెంట్స్‌, జాయింట్స్‌లో మార్పుల వల్ల (1.5-2 సెం.మీ వెడల్పు కావడం వల్ల) వెన్నెముక చివరి ఎముక కాక్సిస్‌ వెనక్కి నెట్టబడి ప్రసవం కావడం జరుగుతుంది.
  దీనికి అనుగుణంగా పెల్విక్‌ఫ్లోర్‌లోని లెవటార్‌ అనే కండరాలు సాగడం, సర్విక్స్‌ ద్వారం విప్పారి ప్రసవం అవ్ఞతుంది. మిడ్‌ పెల్విక్‌ సన్నగా వ్ఞంటే మాత్రం అబ్‌స్ట్రక్టెడ్‌ లేబర్‌ అవ్ఞతుంది.
  రకాలు: ఎదిగే వయస్సులో పోషకాహారలోపం, పుట్టుకతో వచ్చే పెల్విక్‌ వెన్నముక లోపాలు, వ్యాధుల వల్ల, ఆక్సిడెంట్స్‌, గాయాల వల్ల కూడా పెల్విక్‌ నిర్మాణ ఆకృతుల్లో తేడాలు రావడం వల్ల కూడా గర్భధారణలో, ప్రసవ సమయంలో కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. దీన్నే కంట్రాక్టెడ్‌ పెల్విక్‌ అని అంటారు.
 • కారణాల్ని బట్టి వటిని మూడు తరగతులుగా విభజించవచ్చు
 • పోషకాహారలోపాలు, ఎన్విరాన్‌మెంటల్‌ లోపాల వల్ల కంట్రాక్టెడ్‌ పెల్విక్‌లో కొద్ది మార్పులుండడం సహజం. ఇది చాలామంది గర్భిణుల్లో ఉంటుంది. కాల్షియం వంటి ఎముకధాతువ్ఞల లోపాల వల్ల కల్గే మేజర్‌ ప్రాబ్లమ్స్‌ (రాచటిక్‌, అస్టియోమలాటిక్‌) అరుదుగా పుట్టుకతో, అవయవలోపాల వల్ల కలిగే వారిలో వంధత్వం సమస్యలేర్పడతాయి.
  ఎముకల వ్యాధుల వల్ల కలిగే లోపాలు
  పెల్విక్‌- పెల్విక్‌ ట్యూమర్స్‌, ఎముకలు విరగడం, గాయాలు, ట్యూబర్‌క్యులార్‌ అర్థ్రైటిస్‌, ఆక్సిడెంట్స్‌, వెన్నెముక (సైనల్‌) వెన్నముక ముందుకు లేదా పక్కకు వంగిపోవడం, గూని, స్పాండిలిధియోసిస్‌, కాక్సిజియల్‌డిసీజెస్‌ వంటి వెన్నెముక లోపాలు, డిస్‌ప్రాలాప్స్‌, కాళ్లు కంజెనెటల్‌ డిస్‌లొకేషన్‌ ఆఫ్‌ హిప్‌, తుంటి ఎముక పుట్టుకతో కాళ్లలోని ఎముక లోపాలు, పోలియో, తుంటి ఎముక వ్యాధి.
 • డెవలప్‌మెంటల్‌ డిఫెక్ట్స్‌ వల్ల కలిగే లోపాలు. నీగీల్స్‌ పెల్విక్‌, రాబర్ట్‌, పెల్విక్‌, పెల్విక్‌ ఎగుడు దిగుడు నిర్మాణకృతి లోపాలు కారణాలుగా ఉన్నాయి.
  రాచటిక్‌ ప్లాట్‌ పెల్విక్‌: ఎముకల అభివృద్ధికి దోహదపడే విటమిన డి, డి3 లోపాల వల్ల, ఫాస్పరస్‌ వంటి మినరల్స్‌ లోపం వల్ల చిన్నతనంలో రికెట్స్‌ వ్యాధి కల్గినప్పుడు పెల్విక్‌ ఎముకలు మెత్తబడి రోగి కదలలేకపోయినప్పుడు, ఎముకలు సకాలంలో సరిగా అతుక్కోకపోవడం (ఆసిఫికేషన్‌) వల్ల కూడా ఆడపిల్లల పెల్విక్‌ నిర్మాణాకృతిలో (ఇన్‌లెట్‌, సాక్రమ్‌ ఎముక పల్చగా ఉండి పక్కకు జరిగినట్లుంటుంది) మార్పులుంటాయి.
  ట్రైరాడికల్‌ పెల్విక్‌: దీన్నే అస్టియోమలసిక్‌ పెల్విక్‌ అంటారు. యుక్తవయసు యువతుల్లో విటమిన్‌ డి, డి3 లోపం వల్ల ప్యూబిక్‌ బోన్స్‌ మెత్తబడడం వల్ల రిలో నడుంనొప్పి, కాళ్లల్లో నొప్పులు గర్భధారణలో, ప్రసవం సమయంలో, పాలు ఇచ్చేటప్పుడు ఎక్కువవ్ఞతాయి. కంప్లీటింగ్‌ ఢీపార్మటీస్‌ వల్ల నార్మల్‌ డెలీవరీ కాదు. అబ్‌స్ట్రక్టెడ్‌ లేబర్‌ లేదా సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయాల్సి వ్ఞంటుంది.
  నీగెల్స్‌ పెల్విక్‌: ఇది కంజెనిటల్‌ అస్టయిటిస్‌ ఆఫ్‌ సాక్రోఇలియాక్‌ జాయింట్స్‌ వల్ల సాక్రమ్‌లో ఒకలా వ్ఞండదు. అంతేకాకుండా యూరినరీ ట్రాక్ట్‌ అబ్‌నార్మలిటీస్‌ వ్ఞంటాయి.
  రాబర్ట్స్‌ పెల్విక్‌: చాలా అరుదుగా వస్తుంది. సాక్రమ్‌ బోన్‌ రెండుపక్కలా అలా భాగం వ్ఞండదు. ఇది ఇన్ఫెక్షన్‌, దెబ్బలు తగలడం వల్ల పెల్విస్‌ అడ్డంగా అవ్ఞట్‌లెట్‌ దగ్గర కంట్రాక్టెట్‌ అయి వ్ఞంటుంది. దీనివల్ల సాక్రమ్‌ బోన్‌ I్థ్థ్న్థ్ౖధ్చ్మ్ఠ ్జ్న్థ్ఠ్బ తో అతుక్కోని ఉండడం వల్ల కాన్పు కష్టమై సిజేరియన్‌ ఆపరేషన్‌ కంపల్సరీగా చేయాల్సి వ్ఞంటుంది.
  స్కలియోటిక్‌ పెల్విస్‌: వెన్నెముక లోపాల వల్ల, వెన్నెముక ఒకవైపు వంగిపోవడం వల్ల శరీరం బరువ్ఞ పెల్విస్‌పై ఒక పక్కపడడం వల్ల దాని నిర్మాణలోపం వల్ల పెల్విస్‌ అబ్‌నార్మల్‌గా (అబ్లిక్‌) కంట్రాక్ట్‌ కావడం వల్ల సిజేరియన్‌ ఆపరేషన్‌ తప్పనిసరి అవ్ఞతుంది. ఫన్నెల్‌ షేప్‌డ్‌ లేదా కైఫోటిక్‌ పెల్విస్‌: ఇది క్షయ లేదా రికెట్‌ వల్ల సాక్రమ్‌ బోన్‌ సన్నగా కావడం వల్ల పెల్విస్‌ ఫన్నెల్‌ గరాటు ఆకారంలో ఉండడం వల్ల కాన్పు కష్టమై సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయాల్సి వ్ఞంటుంది. డిస్టోషియా డిస్ట్రోఫియా సిండ్రోమ్‌: వీరు లావ్ఞగా ఎద్దు మెడతో, విశాలమైన భుజాలతో, చిన్న తొడలతో, శరీరంపై అవాంఛిత రోమాలతో ఉంటారు. వీరిలో మగవారిలోని ఆండ్రాయిడ్‌ పెల్విస్‌ రకం వ్ఞంటుంది. వీరిలో ఇన్‌ఫెర్టిలిటీ లక్షణాలెక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌, బహిష్టు సమయంలో కడుపునొప్పి, బహిష్టుస్రావం తక్కువ కావడం వ్ఞంటుంది. వీరి గర్భధారణలో టాక్సేమియా, పోస్ట్‌మెచురిటీతో బాధపడడం వల్ల ఇన్‌స్ట్రుమెంటల్‌ డెలీవరీ లేదా సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. కాన్పు తర్వాత పాలు పడవు
 • డాక్టర్‌. కె.ఉమాదేవి,తిరుపతి

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/