వేసవిలోనూ గర్భిణీలు హుషారుగా ..

ఆహారం-ఆరోగ్య సంరక్షణ

pregnant-women-careful-even-in-summer
pregnant-women-careful-even-in-summer

గర్భం దాల్చిన మహిళ శరీరంలో వచ్చే మార్పులు వారికి కొంత ఇబ్బందిని కల్గిస్తాయి.. వేసవిలో ఎండలు గర్భిణీలను మరింత అసౌకర్యానికి గురిచేస్తాయి.. అయితే ఆహారం నుంచి దుస్తుల వరకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వేసవిలోనూ హుషారుగా ఉండొచ్చు.

హైడ్రేషన్:

రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి.. కొబ్బరి నీళ్లు లేదా తాజా పండ్ల రసాలు తాగుతూ ఉండాలి.

ఒంట్లో తగ్గకుండా చూసుకుంటే ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది..

ఆహారం:

ఆకు కూరలు, మొలకెత్తిన విత్తనాలతో చేసిన సలాడ్స్, పండ్లు ఆహారంలో ఎక్కువగా చూసుకోవాలి.. పెరుగు, మజ్జిగ కూడా చల్లదనాన్నీ ఇస్తాయి.. ఎక్కువగా నూనె, నెయ్యి, మసాలా, ఉప్పు ఉన్న ఆహారాన్ని చాలా వరకు తగ్గించాలి.

వ్యాయామం:

తేలికైన వ్యాయామాలు చేయాలి.. ఎక్కువ సమయం నిల్చోవటం, కూర్చోవటం వలన కాల మీద ఒత్తిడి పడుతుంది… అప్పుడు కళ్ళకు కొంచెం ఎత్తులో ఉంచాలి.

దుస్తులు, చెప్పులు:

వదులుగా, తెలుపు రంగులో ఉన్న దుస్తులు ధరించాలి.. గర్భం దాల్చిన తర్వాత పాదాలు వాపులు వస్తుంటాయి.. పాదాలకు సౌకర్యంగా వుండే చెప్పులు వేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు..

నిద్ర:

బయట ఎండలు ఎక్కువగా వుండే ఈ సమయంలో మధ్యాహ్నం కూడా కనీసం అరగంట నిద్ర పోయేలా ప్రణాళిక వేసుకోవాలి.

‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/