స్వైన్‌ ఫ్లూతో మృతి చెందిన గర్భిణి

ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీసిన గాంధీ వైద్యులు

Gandhi Hospital, Hyderabad
Gandhi Hospital, Hyderabad

హైదరాబాద్‌: స్వైన్‌ఫ్లూతో ఓ గర్భిణి మృతి చెందిన ఘటన హైదరాబాదలోని గాంధీ ఆసుపత్రిలో జరిగింది. స్వైన్‌ ఫ్లూ కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమెకు గాంధీ వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హఠాత్తుగా గుండెపోటు రావడంతో గర్భిణి చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. అయితే ఆమె గర్భిణి కావడంతో, ఆమె చనిపోయిన వెంటనే ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉందని వారు వివరించారు. కాగా కరీంనగర్‌కు చెందిన షహనాజ్‌కు స్వైన్‌ ఫ్లూ వ్యాధి వ్యాపించడంతో తొలుత వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రి ఐసియులో ఆమె చికిత్స పొందుతుండగా గుండె పోటు రావడంతో చనిపోయారు. మహిళ మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/