సమ్మె సైరన్.. ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేత

జేఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు నోటీసులిచ్చిన ఉద్యోగ సంఘాలు
ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె


అమరావతి : ఏపీలో సమ్మె సైరన్ మోగింది. పీఆర్సీ అంశంపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. రాష్ట్ర జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు ఉద్యోగ సంఘాల నేతలు నోటీసును ఇచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని సమ్మె నోటీసులో డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకునేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని చెప్పారు.

మరోవైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చర్చలకు రావాలని పిలిచినా ఉద్యోగ సంఘాల నేతలు రాలేదని చెప్పారు. వారు వస్తే అన్ని విషయాలను వివరిస్తామని తెలిపారు. రేపు కూడా వారి కోసం ఎదురు చూస్తామని… చర్చలకు రావాలనే సమాచారాన్ని పంపిస్తామని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/