‘ప్రతిరోజు పండగే’ : సాయిధరమ్‌తేజ్‌

'ప్రతిరోజు పండగే' : సాయిధరమ్‌తేజ్‌
PRATI ROOJU PANDAGAE PRE RELEASE EVENT

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ప్రతిరోజు పండగే.. సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం ప్రీరిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. అల్లు అరవింద్‌, దిల్‌రాజు, యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, ఈచిత్రం పెద్ద హిట్‌ అవుతుందని భావిస్తున్నానని, మా యూనిట్‌అంతా నమ్మకంతో ఉందన్నారు.. సాయితేజ్‌ ఈసినిమాలో చక్కగా నటించాడని అన్నారు. యువీ వంశీ తను కలిసి చేస్తున్న మూడవ చిత్రమని తెలిపారు.. బన్నీవాసు కష్టపడి ఈచిత్రాన్ని నిర్మించాడని, నరేష్‌, రావు రమేష్‌ పాత్రలు అలరిస్తాయని అన్నారు.
హీరో సాయితేజ్‌ మాట్లాడుతూ, అభిమానులంటే మాకు ప్రతి రోజు పండగే అన్నారు. తనకు ఎప్పుడూ అండగానిలబడింది మెగాఫ్యాన్స్‌ అన్నారు. తను ఈసినిమాలో సిక్స్‌ప్యాక్‌లో నటించానని తెలిపారు.. మెగాస్టార్‌గారి ఆశీస్సులతోపాటు అభిమానుల ఆశీస్సులు కూడ ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఈచిత్ర దర్శకుడు మారుతి, రాశీఖన్నా, నరేష్‌, దిల్‌రాజు, సత్యరాజ్‌ తదితరులు మాట్లాడారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/