ఆప్ తో కలసి పని చేయబోతున్న ప్రశాంత్ కిశోర్

ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన కేజ్రీవాల్

Prashant Kishore
Prashant Kishore

న్యూఢిల్లీ: ప్రశాంత్ కిశోర్ దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ఆయన సేవలను ఉపయోగించుకుంటే గెలుపు తథ్యమని వివిధ పార్టీలు భావిస్తుంటాయి. గతంలో ఆయన సేవలను బిజెపి, వైఎస్‌ఆర్‌సిపి ఉపయోగించుకున్నాయి. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి ఆయన పని చేస్తున్నారు. తాజాగా ఆయనతో మరో పార్టీతో చేతులు కలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కోసం ఆయన పని చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ స్వయంగా ప్రకటించారు. ప్రశాంత్ కు కిశోర్ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ తమతో కలసి పని చేయబోతోందనన్న విషయాన్ని అందిరితో పంచుకోవడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడి ప్రభంజనాన్ని కేజ్రీవాల్, ప్రశాంత్ కిశోర్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.
తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/