మంగళగిరిపై ప్రశాంత్‌ కిశోర్‌ బృందం వ్యూహం

prashant kishor
prashant kishor


మంగళగిరి: మంగళగిరి లోక్‌సభ స్థానానికి టిడిపి అభ్యర్థిగా నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఐతే మంగళగిరి బరిలో అమీతుమీ తేల్చుకోవాలని వైఎస్‌ఆర్‌సిపి నిర్ణయం తీసుకుంది. 200 మంది సభ్యుల వైఎస్‌ఆర్‌సిపి ఎన్నికల సలహాదారు ప్రశాంత్‌ కిశోర్‌ బృందం మంగళగిరిలో మకాం వేసింది. జగన్‌ సోదరి షర్మిల మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. లోకేశ్‌ను ఓడించాలనే ఒకే ఒక లక్ష్యంతో పికే టీమ్‌ వ్యూహం రచించింది. దీనిలో భాగంగానే తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ..వైఎస్‌ఆర్‌సిపి జెండాలతో ఉన్న వాహనాలు మంగళగిరిలో చక్కర్లు కొడుతున్నాయి. వీరంతా ఇంటింటికీ తిరిగి ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్లు సేకరించి ఆ సమాచారాన్ని ట్యాబ్‌ల్లో నిక్షిప్తం చేసి వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయానికి పంపుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/