షర్మిల కోసం PK రంగంలోకి ..?

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల..రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహరదీక్ష చేపడుతూ నిరుద్యోగ యువతను దగ్గర చేసుకుంటుంది. తమ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ సాయం తీసుకోబోతుంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిశోర్ ఇక ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని స్పష్టం చేశారు. అయితే అంతకుముందే షర్మిలతో ప్రశాంత్ బృందం ఒప్పందం చేసుకోవడం వల్ల ఆ ఒప్పందంలో భాగంగానే షర్మిల పార్టీతో ప్రశాంత్ టీం పనిచేయబోతుందనే చర్చ నడుస్తుంది. ప్రశాంత్ కిశోర్ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐపీఏసీ) సెప్టెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగించనుందని వైఎస్‌ఆర్‌టీపీ సభ్యులు చెపుతున్నారు. గతంలో జగన్ కోసం ప్రశాంత్ కిశోర్ పనిచేసిన సంగతి తెలిసిందే.