ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కు షాక్‌

జేడియూ నుంచి బహిష్కరించిన పార్టీ

Prashant Kishor
Prashant Kishor

పాట్నా: జనతాదళ్ యునైటెడ్ (జేడియూ) పార్టీలో నితీశ్ కుమార్ తర్వాత రెండో స్థానంలో ఉన్న ప్రశాంత్ కిశోర్ కు ఆ పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత నితీశ్ కుమార్ ను ఉద్దేశించి బహిరంగంగా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ప్రశాంత్ కిశోర్ పై ఆ పార్టీ కన్నెర్ర చేసింది. క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించారంటూ ఏకంగా పార్టీ నుంచి వెళ్లగొట్టింది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన పీకే… వైసీపీ సహా పలు పార్టీల కోసం పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ కోసం ఆయన పని చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/