యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్

వావి వరసలు మరిచిపోయి తండ్రీ కూతుళ్లపై నీచంగా కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు పీటీ వారెంట్పై ఇక్కడకు తరలిస్తున్నారు.

సోషల్ మీడియా యూజర్స్ సంఖ్య రోజు రోజుకు పెరగడంతో వారిని ఎంటర్ టైన్ చేస్తూ వాళ్ల ఫోకస్ తమవైపు తిప్పుకునేందుకు కొందరు యూట్యూబర్లు చేస్తున్న వెకలి చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఇప్పటి వరకు ఈ యూట్యూబర్ చేసిన వీడియోల సంగతి పక్కన పెడితే కొద్ది రోజుల క్రితం తండ్రి, కూతుళ్ల రిలేషన్ పై అసభ్యకరంగా వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు యూట్యూబర్ ప్రణీత్.

ప్రణీత్ నిర్వహించిన ఆ ఆన్‍లైన్ చర్చలో పాల్గొన్న అతడి ఫ్రెండ్స్ కూడా కామెంట్లు చేశారు. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వెలుగులోకి తెచ్చారు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. అతడి అచూకీ కోసం గాలించిన పోలీసులు నేడు (జూలై 10) చిక్కడంతో అరెస్ట్ చేశారు.