వెంటిలేటరే పైనే ప్రణబ్ ముఖర్జీ ఆర్మీ ఆసుపత్రి

pranab-mukherjee

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంకా వెంటిలేటర్ సపోర్ట్ పైనే ఉన్నారని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి వైద్యులు శనివారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని పేర్కొన్నారు . ‘ప్రణబ్ జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆయనను ఇంటెన్సివ్‌ కేర్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఆయన ప్రాణాధారాలు స్ధిరంగా ఉన్నాయి. నిష్ణాత వైద్య బృందం ఆయనను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది’ అని హాస్పిటల్‌ ప్రకటన విడుదల చేసింది.

కాగా శుక్రవారం ప్రణబ్‌ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ తన తండ్రి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, కాంతికి ఆయన కండ్లు కొంత ప్రతిస్పందిస్తున్నాయని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో ప్రణబ్‌ మృతి చెందారని వస్తున్న వార్తలను ఆమె ఖండించిన విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌ ముఖర్జీ(84) అత్యవసర శస్త్రచికిత్స నిమిత్తం ఢిల్లీ కాంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో చేరారు. తరువాత ఆయనకు పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/