ఆమ్‌ ఆద్మీ తరపున ప్రకాశ్‌రాజ్‌ ప్రచారం

Prakash Raj
Prakash Raj

న్యూఢిల్లీ: ప్రముఖ సిని నటుడు ప్రకాశ్‌రాజ్‌ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు ఢిల్లీలో ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తరువాత మీడియాతో మాట్లాడుతు.. ఆమ్‌ ఆద్మీతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను ఆపార్టీ కార్యకర్తను కాకపోయిన ఆ పార్టీ విధానాలతో సంతృప్తి చెందిన సామాన్యుల్లో నేనూ ఒకడిని. వ్యవస్థలో మార్పులకు ప్రయత్నిస్తున్న ఆప్‌లాంటి పార్టీలు దేశానికి ఎంతో అవసరం అని ప్రకాశ్‌ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడికి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కేవలం కొన్ని విషయాల్లో వారు అనుసరిస్తున్న విధానాలకే తాను వ్యతిరేకమన్నారు. మోడి పేరు చెప్పుకొని కొంత మంది బిజెపి నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/