‘మా’ ఎన్నికలు.. నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్
ఈనెల 29వరకు నామినేషన్ల స్వీకరణ
prakash-raj-films-nominations-for-maa-president-election
న్యూఢిల్లీ : ‘మా’ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాశ్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్ ప్యానల్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈనెల 29వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్స్ పరిశీలన 30 వరకు జరగనుంది. అక్టోబర్1-2 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించు కోడానికి గడువు ఉంది. కాగా, అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి.
కాగా, ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యులని కొద్ది రోజుల క్రితం ప్రకటించగా వారిలో జయసుధ,శ్రీకాంత్, బెనర్జీ,సాయి కుమార్,తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనిత చౌదరి, సుధ, అజయ్, నాగినీడు,బ్రహ్మాజీ, రవి ప్రకాశ్, సమీర్, ఉత్తేజ్, ఏడిద శ్రీరామ్, శివా రెడ్డి, భూపాల్, టార్జాన్, సురేష్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్,గోవింద రావు, శ్రీధర్‌రావు ఉన్నారు. అధ్యక్ష బరిలో నిలిచిన జీవిత,హేమలను తమ ప్యానెల్లో చేర్చుకోవడంతో బండ్ల గణేష్ బయటకు వచ్చి సొంతగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/