ప్రకాశం బ్యారేజ్‌ 7 గేట్ల ఎత్తివేత

  • ఎగువ నుంచి పెరిగిన వరద
    లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తం
Prakasam Barrage
Prakasam Barrage

విజయవాడ: పులిచింతల నుంచి వస్తున్న వరద ప్రవాహం పెరగడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లను అధికారులుకొద్దిసేపటి క్రితం ఎత్తి, దిగువకు నీటిని వదిలారు. బ్యారేజ్ 7 గేట్లను ఎత్తిన అధికారులు, మరోవైపు కుడి, ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని పంపుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, వరద నీటి ప్రవాహాన్ని అనుసరించి మిగతా గేట్లను ఎత్తివేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. నదిలో నీటి ప్రవాహం పెరగడంతో వివిధ ఘాట్ల వద్ద యాత్రికుల పుణ్యస్నానాలపై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. కృష్ణలంక తదితర నదీతీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నట్టు పేర్కొన్నారు. లంక గ్రామాల్లో ప్రత్యేక సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/