ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the-people
Voice of the-people


పెన్షన్‌ సౌకర్యం కల్పించండి:-సి.శేఖర్‌, మహబూబ్‌నగర్‌

డిఎస్సీ-2003 అభ్యర్థులు ఆనాటి ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా ఫలితాలు వచ్చినా నియామకాలు ఆలస్యంగా చేయడం వలన పాతపెన్షన్‌ సౌకర్యం కోల్పోయారు. ఈ మధ్య కేంద్రప్రభుత్వం ఫలితాలు వచ్చి నియామకాలు ఆలస్యం అయినవారికీ పాతపెన్షన్‌ పథకం వర్తిపంచేయమని ఉత్తర్వులు ఇవ్వడంజరిగింది. అదేవిధంగా వివిధ శాఖలలో పై కారణంగా పాతపెన్షన్‌ కోల్పోయిన అభ్యర్థుల వివరాలు సేకరించింది. అందులో డిఎస్సీ-2003 అభ్యర్థుల వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు మరీఎలాంటి చర్యలు చేపట్టలేదు.కావున ప్రభు త్వం న్యాయం చేసి సమస్య పరిష్కారం చేయాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

కాలాన్ని వృధా చేస్తున్న యువకులు: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

దేశానికి వెన్నముక అయిన యువకులు ఎలాంటి గమ్యం లేకుండా జల్సాల పేరుతో తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నేటి యువకులు నేడు ఎంజా§్‌ు చేస్తే చాలు అనుకుంటున్నారు.కానీ రేపటి భవితవ్యంపై దృష్టి పెట్ట డం లేదు. యువకులు ఎలాంటి నిర్దేశ్యం లేకుండా తిరుగుతు ఉండటం వల్ల తమ పిల్లలభవిష్యత్తు ఏమవ్ఞతుందోనని ఆందో ళనకు గురవ్ఞతున్నారు. యువకులు తమకంటూ ఒక లక్ష్య సాధన పెట్టుకొని, దానిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి ఆ దిశగా కృషి చేస్తే చాలా బాగుగా ఉంటుంది.

గోసంరక్షణపై దృష్టిపెట్టాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

గోసంరక్షణ కోసం రాష్ట్రప్రభుత్వం గుడికో గోమాత కార్యక్రమా న్ని ప్రారంభించడం ముదావహం.రాష్ట్రంలోని మఠాలు, వంశ పారంపర్య పర్యవేక్షణ ఆలయాలు, లేదా పాఠశాలలకు తితిది, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా సదరు కార్యక్రమం ద్వారా దేశ వాళి ఆవ్ఞదూడలను ఉచితంగా అందించే సదరు బృహత్తర కార్యక్రమం గోవ్ఞలసంతతి అభివృద్ధికి నిస్సందేహంగా తోడ్ప డుతుంది. హైందవ ధర్మంలో ఆవ్ఞకు తల్లి స్థానం ఇచ్చారు. గోసంతతి సుభిక్షంగా ఉన్న ప్రాంతాలలో అష్టఐశ్వర్యాలు అభి వృద్ధిచెంది ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారు. కాబట్టి రాష్ట్రప్రభుత్వం ప్రతి మండలంలో గో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ముసలి, అనారోగ్యంతో ఉన్న ఆవ్ఞలకు ప్రత్యేక వైద్యసదుపాయం అందించాలి. కళేబరాలకు గోవ్ఞలను తరలించడాన్ని నిషేధిస్తూ గో సంరక్షణ చట్టం తీసుకురావాలి.

సుప్రీం సూచనలు అమూల్యం:-డా.డి.వి.జి.శంకరరావు,పార్వతీపురం

కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై రాజధానిలో వేలాది రైతులు చేపట్టిన ఆందోళన నెల్లాళ్లుగా సాగుతున్నా దానిపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరును సుప్రీం తప్పుపట్టింది. రాజధాని సరిహద్దులో చేరిన వేలాది రైతులు చలిలోపడుతున్న బాధలు, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.పేరుకైతే ప్రభుత్వంవెంటవెంటనే స్పందిస్తున్నట్టే కనబడుతోంది.కానీ ఫలితంమాత్రంసున్నా.ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నతీరు.ఇప్పటికీ ఎనిమిది దఫాలుగా కేంద్రమంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపారు. అన్నీ విఫలమే. కారణం స్పష్టంగాఉంది.మూడుచట్టాలు రద్దుచేయాలనిరైతుల డిమాండ్‌. ఆ విషయం తప్పఇంకేమైనా అడగండి అంటూకేంద్రం జవాబు. ఏదిఏమైనా ఈ పీటముడి ఇప్పుడు సాగుతున్న చర్చల తీరుతో వీడేది కాదు. సమస్య పరిష్కారం కేంద్రం చేతిలోనే ఉంది. బాధ్యత కూడా కేంద్రానిదే.

జీవితంలో రాజీపడటమే మేలు:-ఆర్‌.వి.కనకమ్మ, విశాఖపట్నం

మనిషికి ఉన్నత ఆశయాలుండటం సహజం. కాని అవి తీరే మార్గాలు దొరకడం చాలా కష్టం. పెద్దపెద్ద చదువ్ఞలు చదవా లని,ఉన్నతమైన ఉద్యోగాలుచేయాలని, చాలామంది తలపోసి, తమ జీవితాలనునాశనం చేసుకుంటున్నారు. చదువలేని కోర్సు తీసుకొని అటు చదవలేక, ఇటు మానలేక ఉన్నారు. కొందరు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని జీవచ్ఛవాలుగా జీవితం బతుకుతు న్నారు. ఉన్నంతలో తృప్తిపడటం ప్రతి మనిషి నేర్చుకోవాలి. అందని వాటి వెనుక పరుగెత్తి, ఉన్న దాన్ని వదులుకోరాదు. జీవితంలో రాజీపడితే తప్ప మనిషికి తృప్తికలుగదు.

భారం కాదు బాధ్యత? -కెె.రామకృష్ణ, నల్గొండ

వృద్ధుల సంరక్షణ కన్న వారి కనీస బాధ్యత వయసుడిగిన దశలో తమ వారసుల నుంచి వారుకోరుకునేది ప్రేమపూర్వక పలకరింపు ఆదరణ,అభిమానాలే తప్ప ఆడంబరాలు, ఆధునిక సౌకర్యాలుకాదు.విలువలు,బంధాలు, సంస్కృతీ సంప్రదాయా లను భావితరాలకు అందించేసామాజిక రాయబారులు వృద్ధు లు. పరస్పర ఆధారిత కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉన్న సమాజంలో ఇంటి పెద్దలే అన్ని బాధ్యతలూ నిర్వర్తించే వారు. కాలక్రమేణ శరీరంలో శక్తిక్షీణించి ఆరోగ్య ఆర్థిక సామాజిక సమ స్యలు వారిని చుట్టుముడుతాయి. ఇలాంటి సమయంలో వారికి అండగానిలవాల్సిన కుటుంబసభ్యులుచిన్నచూపుచూస్తున్నారు.

తాజా ‘మొగ్గ” (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/