ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

పత్రికలలో వాస్తవమే ప్రచురించారు: -గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

తాము సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పలేదనీ, పత్రికల లో తప్పుగా ప్రచురించారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభలో చెప్పటం సభనూ,ప్రజలనూ తప్పుదోవ పట్టించ డమే! ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా గత సెప్టెంబర్‌ ఒకటవ తేదీన ప్రారంభించిన కార్యక్రమానికి సంబం ధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, సమాచార శాఖ, జిల్లా అధి కారిక పత్రాలన్నింటిలో సన్నబియ్యం అనే తెలియపరిచారు. అలాగే ఆనాడు టివీలలో పౌరసరఫరాల శాఖామంత్రి సన్న బియ్యం పంపిణీచేస్తామని చెప్పడం ప్రజలందరూ వీక్షించారు. అదే సమాచారం ఆనాడు దినపత్రికలలో ప్రచురించారు. అలా చెప్పిఉండకపోతే అప్పుడేతప్పుగాప్రచురించారనిసరిదిద్దే ప్రయ త్నం చేయాలి. ఇప్పుడు మూడు నెలల తర్వాత శాసనసభలో పత్రికలో తప్పుగా ప్రచురించారని చెప్పటం హాస్యాస్పదం.

స్వార్థ రాజకీయాలను విడనాడాలి: -వీరుభొట్ల పేరయ్యశాస్త్రి, విజయవాడ

పౌరసత్వ సవరణ బిల్లు విషయంలోకాంగ్రెస్‌,వామపక్షాల ధోర ణి ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అఖండ భారతదేశం హిందూ-ముస్లిం మత ప్రాతిపదికన విడిపోయి ముస్లింలకు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు దక్కడానికి గాంధీనెహ్రూ వంశ స్వార్థ రాజకీయ నాయకత్వ కాంక్షే ప్రధాన కారణం. ముస్లింలకు రెండు దేశాలనిచ్చిన కాంగ్రెస్‌ హిందువ్ఞలకు ఏమిచ్చింది? సామ్యవాదుల మద్దతుకు తలొగ్గి రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక సామ్యవాద పదాలను చేర్చింది. తద్వారా దేశ ప్రజల్ని మెజారిటీ, మైనారిటీలుగా విభజించింది. తాను చెప్పిన లౌకికవాద నిర్వచనానికి భంగం కలిగిస్తున్నది.

నో స్మార్ట్‌ ఫోన్‌ డే: -ఎం.రాంప్రదీప్‌, తిరువూరు

ప్రస్తుతం విద్యార్థులకుపుస్తకాల బరువ్ఞతగ్గించడానికి నో బ్యాగ్‌ డే వంటివి నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఆరు నెలల పసిబాలుడి నుండి అరవై ఏళ్ల వృద్ధుల వరకు స్మార్ట్‌ఫోన్‌కు బందీలవుతున్నారు.టివీలు,సినిమాలు కంటే కూడా స్మార్ట్‌ఫోన్‌ అన్ని వర్గాల ప్రజలపై తన ప్రభావాన్ని అమితంగా చూపుతుం ది.కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా వారానికోకసారి నో స్మార్ట్‌ ఫోన్‌ డే ని ప్రకటించుకొని కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపాలి. అత్యవసరమైన ఫోన్‌ కాల్స్‌కి సాధారణ ఫోన్‌ని దగ్గరుంచుకుంటే సమయం ఆదా అవుతుంది.

బహిరంగ విపణికి ఉల్లిని తరలించాలి:-యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

రాష్ట్ర ప్రజలకు ముప్పైఅయిదు వేల క్వింటాళ్ల ఉల్లిపాయలు ఎక్కువధరకు కొనుగోలు చేసి రైతుబజార్‌లో కేవలం ఇరవైఐదు రూపాయలకి సరఫరా చేస్తున్నట్లు జగన్‌ ప్రభుత్వం గొప్పగా చెబుతోంది.అవి కేవలం రైతుబజార్‌ ఉన్న నగరాలు, పట్టణాల ప్రజలకు మాత్రమే అందుతున్నాయి.పల్లెలు, గ్రామాలు, మారు మూల ప్రాంతాల్లో ఉలిపాయ దొరకడం మాటటుంచి కనప డడమే లేదు. రాష్ట్రంలో సుమారు కోటియాభై లక్షల కుటుంబా లున్నాయి. అన్ని గ్రామాల్లో గల కుటుంబాలకు పంపిణీ చేసినా ఒక్కో కుటుంబానికి రమారమి రెండు కిలోలుపైబడి ఎటువంటి కొరత లేకుండా సరఫరా చేయవచ్చు. దిగుమతి అయిన ఉల్లిపాయలు ఏ గోదాముల్లో దాక్కున్నాయో అధికార పార్టీ నాయకులకే తెలియాలి. దిగుమతి అయిన ఉల్లిని బహిరంగ విపణికి అందిస్తే ఈ సమస్య ఎదురుకాదు.

బాధ్యతను మరవద్దు: -కాయల నాగేంద్ర, హైదరాబాద్‌

ఒక బాధ్యతగల హోదాలో ఉన్న వ్యక్తులు హుందాగా ప్రవర్తిం చాలి. వారి ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు అందరూ మెచ్చేలా ఉండాలి.ఎదుటివారు తప్పుచేసి ఉంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. ఒక బాధ్యతగల పదవి లోఉంటూ పొరపాటుగా మాట్లాడినా,మనోనిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినా చేటు కలిగిస్తుందని మరవద్దు. పదవి శాశ్వతం కాదు.ఈరోజు ఉంటుంది. రేపుపోతుంది. మంచి ప్రవర్తన కలిగి ఉంటే ప్రజలలో ఆదరణ, విశ్వాసం కలుగుతుంది. భావితరాల వారికి ఎలాంటి సందేశం ఇస్తున్నామన్న ఆలోచన లేకుండా మాట్లాడటం దురదృష్టకరం.అధికారంలో ఉన్న వ్యక్తులు అభ్యంతకర, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటైంది.

రాజ్యాంగ స్ఫూర్తికి చిల్లు: -డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

డిసెంబరు 31,2014కు ముందు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆప్ఘని స్థాన్‌ నుండి భారతదేశంలోకి వచ్చిన అక్రమ వలసదారుల్లో ముస్లిమేతరులకు భారత పౌరసత్వంపొందడానికి అర్హత కల్పిం చేదిశగా కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం.రాజ్యాంగం అన్నిమతాల్నీ సమానంగా గౌరవించే లౌకి కత్వాన్ని, అందరికీ సమానత్వపు హక్కుని దఖలుపర్చింది. పౌరసత్వం నిర్ణయించడానికి మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవ డం ఆ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. కేవలం మూడు దేశాల నుండి కొన్నిమతాల వారికే ఆ అవకాశంకల్పించడం రాజ్యాంగపరంగా, తరతరాల దేశసంస్కృతీపరంగా కూడా సబబుకాదు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/