ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

పెరుగుతున్న నిరుద్యోగం -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

రెండువేల పధ్నాలుగులో అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం కోటి ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది. కాగా అయిదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే నాటికి 10 శాతం కూడా అమలు కాలేదని ఫిక్కి, అసోచాం వంటి సంస్థలు అధ్యయనం చేసి ప్రకటించాయి.

2019ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వం కోటి ఉద్యోగాల కల్పన హామీని తిరిగి ఇచ్చింది. పదవీకాలం పూర్తయ్యి సంవత్సరం గడుస్తున్నా ఒక శాతం ఉద్యోగాల భర్తీ కూడా జరగలేదు. 2016లో పెద్దనోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు 50 లక్షల ఉద్యోగాలు పోయినట్లు, నిరుద్యోగిత గత 40 సంవత్సరాలలో అత్యల్ప స్థాయికి పడిపోయినట్లు ఇటీ వల సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ అధ్య యన నివేదిక తెలియచేస్తోంది.

జాతీయ ఉపాధి పథకం ద్వారా ఉపాధి కల్పన గత అయిదేళ్లలో 48 శాతం తగ్గినట్లు ఉపాధిలేమి కారణంగా వలసలు పెరుగుతున్నాయన్న గణాంకా లు ప్రభుత్వ పథకాల వైఫల్యానికి నిదర్శనం.

సన్నబియ్యం అందించాలి:-యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

రేషన్‌కార్డు దారులందరికీ మొదట సన్నబియ్యం ఇస్తామని, తర్వాత నాణ్యమైన బియ్యం అందిస్తామని పౌరసరఫరాల మంత్రి చెప్పుకుంటూ ఏడాదిపాలన సాగించారు. ప్రభుత్వం ఇస్తున్న బియ్యంలో రాళ్లు, ముక్కిపోయి పచ్చిబియ్యం కావడం తో అన్నంముద్దగా, జావగాఉంటుంది. అలాగే వ్యవసాయ శాఖా మంత్రి పండ్లు, కూరగాయలు వంద రూపాయలకే ఇంటింటికీ సరఫరా చేస్తామన్న ప్రకటన దినపత్రికల్లో తప్ప ఆచరణలో ఎక్కడా కనపడటం లేదు. ప్రభుత్వం అందించే నిత్యావసరాలపై గంపెడాశలు పెట్టుకున్న కూలినాలి చేసుకునే పేదలను ప్రకటనలతో మభ్యపెట్టడం సరైనదికాదు.

వృధా అవుతున్న నీరు:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

రాష్ట్రంలో పెద్ద, చిన్న జలాశయాలు, చెరువ్ఞలు కాలువల నుండి పంట పొలాలకు ఏర్పాటు చేయబడిన నీటి సర ఫరావ్యవస్థ దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోక శిధిలా వస్థకు చేరుకుంది. కాలువలకు లైనింగ్‌ దెబ్బతినడం, గేట్లు, షట్టర్స్‌ వంటి నీటి ప్రవాహాన్ని నియంత్రించే పరిక రాలు తుప్పుపట్టి పనిచేయకపోవడంతో ఎంతో విలువైన నీరు వృధా అవ్ఞతోంది. గ్రామాలలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు లు, పైపులైన్‌ వ్యవస్థ పాడైపోవడం వలన సురక్షిత నీటి సరఫరా ఎండమావే అవ్ఞతోంది.

అత్యంత విషాదకరం:-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

విశాఖపట్నంలో ఎల్‌జి పాలిమర్స్‌ పరిశ్రమలో స్టరీన్‌ విష వాయువు లీక్‌ కావడంతో 11మంది మృత్యువాతపడడం, 300 మంది ఆస్పత్రి పాలవ్వడం, వేలాదిమంది అస్వస్థతకు గురికావ డం అత్యంత విషాదకరం. ఆ బహుళజాతి పరిశ్రమ చుట్టూ మూడుకిలోమీటర్ల దూరంవరకూ ఉన్నగ్రామాల్లో విషవాయువు ప్రభావం చూపింది.

రోడ్లపై మరణించిన పశుపక్ష్యాదులు చూ స్తుండగానే నేలకొరిగిపోతున్న మనుషుల వీడియోలు కంటనీరు తెప్పించాయి. వెంటనే సత్వర స్పందన చూపిన అధికారగణం, బాధితులని హుటాహుటిన పరామర్శించి ప్రభుత్వసాయం ప్రకటించిన ముఖ్యమంత్రి అభినందనీయులు. అయితే అసలు జరగాల్సిన పనిఎంతో ఉంది. విషవాయువ్ఞలు లీకయ్యే ప్రమా దం ఉన్న పరిశ్రమలు వందకువంద శాతం జాగ్రత్త వహించాలి. చిన్న పొరపాటైనా పెద్దసంఖ్యలో ప్రాణాల్ని, ఆరోగ్యాలని కబళించే పెను ప్రమాదంగా మారుతుంది.

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఎక్కడ?:-గరిమెళ్ల భారతీదేవి, ఏలూరు, ప.గోజిల్లా

సంస్కరణల కోసమే ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి నూతన ఎన్నికల కమిషనర్‌ను ఆఘమేఘాల మీద నియమించిన రాష్ట్ర పాలకులు, అదే ఉత్సాహం మహిళలపై అత్యాచారాలు జరిపిన నేరస్థులను సత్వరం శిక్షించడానికి ఉద్దేశించిన ఫాస్ట్‌ట్రాక్‌కోర్టుల ఏర్పాటులో ఎందుకు చూపించలేకపోయారు? ప్రచార ఆర్భా టాలతో దిశా చట్టం తీసుకువచ్చామని ప్రగల్భాలు పలికారు.

పాత పోలీసు స్టేషన్లకే రంగులు వేసి బడాయికబుర్లన్నీ చెప్పా రు. జిల్లాకో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేస్తాం అన్నారు. నెలలు గడుస్తున్నా క్రియా శూన్యం. సంవత్సర కాలంలో ఇంతవరకు ఒక్క నేరస్థుని కూడా శిక్షించిన దాఖలాలు మృగ్యం. రాజధాని గ్రామాల్లో గాంధేయపద్ధతుల్లో ఆందోళనలుచేస్తున్న మహిళలపై మాత్రం పోలీసుజులుం ప్రదర్శిస్తున్నారు. ఇదెక్కడి ద్వందనీతి?

అడవులను కాపాడుకోవాలి: -సయ్యద్‌ షఫీ, హన్మకొండ

పచ్చనిచెట్లు ప్రగతికి మెట్టు. మానవుల స్వార్థానికి అడవులు అంతరించిపోతున్నాయి. మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్థం కారణంగా 80శాతం వర కు అడవ్ఞలు అంతరించిపోయాయి.

గడచిన దశాబ్దకాలం నుండి అడవులను వేగంగా నరికివేస్తున్నారు. పరిశ్రమల స్థాపన కోసం, పంట పొలాల కోసం, కలప కోసం ఇతర అవసరాల కోసం అడవుల నరికివేతజరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అడవుల సంరక్షణకు చర్యలు చేపట్టాలి.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/