ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

పాడైపోతున్న ఆహార నిల్వలు: -పి.వరలక్ష్మీ, తెనాలి, గుంటూరు జిల్లా

దేశంలో వ్యవసాయోత్పత్తులలో మూడోవంతు కుళ్లిపోవడమో లేక ఇతర విధాలుగా చెడిపోవడమో జరుగుతుంది.

మరికొంత శాతం వర్షాకాలంలో ఉత్పత్తులను సక్రమంగా నిల్వ చేసే వస తులు లేకపోవడం వలన పాడైపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆహారశుద్ధి పరిశ్రమలు శీతాల గిడ్డంగులను పెద్దఎత్తున ఏర్పాటు చేయాలి.

ఇందువలన గ్రామీణ ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు దేశీయంగా ఆహర భద్రత ఏర్ప డుతుంది. మరోకవైపు రోజుకు ఒకసారి భోజనం చేయడం గగనంగా బ్రతుకున్న పేదకుటుంబాలు, యుపి,బీహర్‌, ఒడిశా వంటి వెనుకబడినరాష్ట్రాలలో ఆకలిచావులు పెరుగుతున్నాయి.

అందుకే ఆహరపదార్ధాల వృధాని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలతో పాటు ప్రజలలో పెద్దఎత్తున అవగాహన కల్పించాలి.

విద్యుత్‌రంగం అస్తవ్యస్తం: -సి.వి. కృష్ణ, హైదరాబాద్‌

దేశంలో విద్యుత్‌ రంగం అయిదేళ్ల క్రితమే సంస్కరణల బాట పట్టినా ఆశించిన మేరకు ఫలితాలు సాధించకపోగా మరింత అస్తవ్యస్తంగా తయారయ్యింది.

సంప్రదాయ విద్యుత్‌ ఉత్పా దన్న పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా విద్యుత్‌ తయా రీ, పంపిణీ విభాగాలు నానాటికీ కష్టాలలో కూరుకుపోతు న్నాయి.

40వేల మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం గల 34 ప్రైవేట్‌ ధర్మల్‌ ప్రాజెక్టులు మొండి బకాయిల కారణంగా నిరర్థక ఆస్తులుగా మారిపోతున్నాయి.

సహజవాయువు కొరత వలన మరొక ఇరవై విద్యుత్‌ కేంద్రాలు రెండేళ్ల నుండి మూత పడ్డాయి.ప్రభుత్వం దిద్దుబాటుచర్యలుచేపట్టకపోతే దేశీయంగా విద్యుత్‌ రంగం సంక్షోభంలో చిక్కుకోనుంది.

దెబ్బతింటున్న రోడ్లు :-ఎస్‌. శ్రీనివాసరాజు, వనస్థలిపురం

రాష్ట్రంలో చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాలు కురుస్తున్న కారణంగా అవి మరీఅధ్వాన్నం అయిపోతు న్నాయి. దీంతో ప్రమాదాలు పెరిగి, ప్రాణాలు పోతున్నా యి.

ప్రభుత్వం తక్షణ చర్యగా దెబ్బతిన్న రహదారులను మర మ్మతు చేయాలి. ప్రతి గ్రామానికీ వెళ్లే రహదారులను శాశ్వత ప్రాతిపదికన, నాణ్యతా ప్రమాణాలతో పటిష్టం చేయాలి. ప్రమాదాలను అరికట్టాలి. అలాగే రహదారులపై అడుగడు గునా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం కొరత: – ఎన్‌.రాజేష్‌, గోదూర్‌,జగిత్యాల

వర్షాలు విపరీతంగా కురియడంతో వ్యాధులు ప్రబలిపోతు న్నాయి.పెరుగుతున్న వ్యాధులకు తగు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులలో కొరత ఎక్కువగా ఉంది.

ఆయా సందర్భాలలో ప్రమాదాలు జరిగిన వ్యక్తులకు తక్షణం ఎలాంటి చికిత్స చేయాలో,ఏ ఆసుపత్రికి తరలించాలో చాలా మందికి అవగాహన లేదు.

వాళ్ళు తొందరగా ఏదోఒక ప్రైవేటు హాస్పి టల్‌కు తీసుకెళ్తున్నారు. సర్పాలతోపాటు తేళ్ళు తదితర విష ప్రాణులు కాటేస్తే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిన పరి స్థితులున్నాయి.

కుక్కలు కూడా ఎక్కువగా సం చరిస్తున్నాయి. ముఖ్యంగా పాముకాటుకు విరుగుడుగా వాడే యాంటీవీనమ్‌ అన్ని ఆసుపత్రిల్లో లభ్యం కాకపోవడం వల్ల బాధితులకు నాణ్యమైన వైద్యం అందడం లేదు.

తపాలా శాఖ పనితీరు: -ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరు జిల్లా

గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు తపాల శాఖ ఎనలేని సేవలు అందిస్తోంది. కానీ చాలా మంది తపాల సిబ్బందికి పని లేదనే భావిస్తున్నారు.

ఇది చాలా పొరపాటు. అయితే గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌)గా ఏళ్లతరబడి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వేలాది ఉద్యోగుల పరిస్థితి పరమ దయనీయంగా మారింది. ఎంత కాలం పనిచేసినా ఆయా సిబ్బందికి ఆర్థిక ప్రోత్సా హకాలు,బీమాసదుపాయాల వంటివి అందుబాటు లోకి రావడం లేదు.

తాత్కాలిక ప్రాతిపదికన నిధులు నిర్వర్తిస్తున్న వీరికి ఇక నైనా వేతన సంఘం సిఫార్సులు వర్తింపచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో నియమించిన కమిటీల వల్ల ర్ట్‌టైమ్‌కు ఉద్యోగుల జీతభత్యాల్లో పని పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లు రాలేదు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిం చి సంబంధిత సిబ్బందికి ప్రయోజనాలను వర్తింపచేయాలి.

కాలుష్య కొరల్లో నాగావళి: -జి.రామకృష్ణ, నల్గొండ

శ్రీకాకుళం జిల్లాకు సంజీవని లాంటి నాగావళి నది క్రమంగా కాలుష్య కొరల్లో చిక్కుకుంది. నదీపరివాహక ప్రాంతాల పరిధి లో ఉన్న మురుగు కాల్వల నుండి నిదిలోనికి మురుగునీరు యధేచ్ఛగా వదిలేస్తున్నారు.

అలాగే పలు పారిశ్రామిక వాడల నుండి హానికర రసాయనాలను నదిలోనికి విడిచిపెడుతున్నా రు. నదిపై ఉన్న కొత్త పాత వంతెనలతోపాటు బ్రిడ్జివద్ద నది నీరు కలుషితం పరిమితులను మించి జరుగుతోంది.

జిల్లా యంత్రాంగం నాగావళి నదినికాలుష్యం కొరల నుండి కాపాడేం దుకు తక్షణం యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/