ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

అయోమయంలో రైతులు:-రఘుపతిరావు గడప, రుద్రంగి, రాజన్నసిరిసిల్ల్ల

రైతులు వ్యవసాయంలో ఎక్కువ భాగంవరి పంటను పండిస్తు న్నారు.వర్షాలు పుష్కలంగా కురవడం, ప్రాజెక్టుల ద్వారా చెరు వ్ఞలు నింపడంవల్ల సంతోషించిన రైతన్న సన్నరకాలు వేయ డానికి సిద్ధమయ్యాడు.

కానీ సన్నరకాలు పండించిన రైతులు సంకట స్థితిలోపడ్డారు. ప్రభుత్వం దొడ్డురకాల వడ్లు మాత్రమే కొనడానికి సుముఖంగా ఉంది. సన్నరకాలను నామమాత్రంగా మాత్రమే ఐకెపి నిర్వాహకులు కొంటున్నారు. మంచి ధర వస్తుందని ఆశించిన రైతు అమ్మడమే కష్టమయ్యే పరిస్థితికి వచ్చేసరికి దిక్కులు చూస్తున్నాడు.

మిల్లర్లు కొంటారని తెలుసు కొని మిల్లుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. మిల్లుల వద్ద రద్దీ కావడంతో టోకెన్‌ విధానం ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో ఆశతో పంటను పండించి తీరా అమ్మడానికి ఇబ్బంది పడుతున్న రైతన్న కష్టాలను ప్రభుత్వం గట్టెక్కించాలి.

పారిశుధ్యంపై దృష్టిసారించాలి: -పి.వేంకటేశ్వర రాజు, హైదరాబాద్‌

మానవుని ఆరోగ్యానికి పారిశుధ్యవ్యవస్థకు ఎంతో సంబంధం ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా అనేక పట్టణాలలో పారిశుధ్య వ్యవస్థ సక్రమంగా లేదు. అనేక గృహాలకు టాయిలెట్స్‌ సౌకర్యం లేదు.

అనేక సంవత్సరాలు పాటు మానవ వ్యర్థాలను కార్మికులే ఎత్తివేసి హేయమైన కార్యక్రమాన్ని చేసేవారు. కాలక్రమంగా ఆధునిక పారిశుధ్య వ్యవస్థకు నాంది పలికారు. ఇంకా పూర్వాపరాల్లోకి వెళ్తే పారి శుధ్య కార్యక్రమం అనేక పేర్లతో మార్పుచెంది చివరకు ఇజ్జత్‌ కా ఘర్‌ ‘గౌరవగృహం అనే పేరుతో పిలువబడుతున్నది.

స్వచ్ఛభారత్‌ నినాదంతో పారిశుధ్య వ్యవస్థ మరింత ప్రాము ఖ్యతను సంతరించుకొన్నది. ప్రభుత్వం ఎంత కృషి చేసినా ప్రజలసహకారం లేనిది ఏకార్యక్రమం విజయవంతం కాలేదు.

ఎన్నికలు సజావుగా జరగాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

డిసెంబరు ఒకటిన జరిగే హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికలు సజావ్ఞగా జరిగే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అందరి ఓట్లు లిస్ట్‌లో ఉండే విధంగా, ఎవరి ఓట్లు కూడా గల్లంతుకాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి ఓటు ఏ బూత్‌లో ఉందో ఓటర్‌కు తెలిసేలా చూడాలి. అలాగే పోలింగ్‌ కేంద్రం లో మౌలిక వసతులు కల్పించడానికి ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలి.

కుర్చీ నితీష్‌ది, పగ్గాలు బిజెపివి:-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

మళ్లీ బీహార్‌కు వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి కావాలన్న నితీష్‌కుమార్‌ కోరిక నెరవేరింది. ప్రాభవం తగ్గుతూ వచ్చినా, ఎన్డీయే కూటమి,పక్షాన ముఖ్యమంత్రిగా ఆయన్నిబిజెపి కూర్చో పెట్టింది. గత మూడు సార్లు కమలం ఆయనకి చేతి కర్రగా పనికివస్తే, ఈసారిమాత్రం ఊతకర్రగా మారింది. ఊతం లేకుం డా ఒక్క అడుగేయలేని పరిస్థితి ఆయనది.

అలా అని బిజెపికి కూడా ఆయన్ని వదులుకోలేకపోవడం తప్పనిసరి. వదిలేస్తే తాను ఎదుటిపక్షంవైపు ఇట్టే మారిపోగల సమర్థుడు. ఆ తరహా చరిత్ర ఉన్నవాడు. ఆఫ్‌కోర్సు వైరిపక్షానికి తాము తగ్గాల్సిన అసవరం లేదనుకోండి. అందుకనే బిజెపికి తాను పెద్ద పార్టీగా అవతరించినా, కూటమి నీతితప్పరాని సందర్భం. తనకి నష్టం లేదు కూడా. ఎన్నికల్లో కూటమిలోనే ఒక పార్టీ,ఇంకో పార్టీని దెబ్బతీస్తున్నప్పుడు కూడా నివారించలేదు.

కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలి: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

ఆరేళ్ల క్రితం పార్లమెంట్‌లో తలుపులు మూసి, టివి ప్రసారాలు నిలిపి,కనీసం సొంతపార్టీసభ్యులకు తెలియపరచకుండా ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అమానవీయంగా విడదీసిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజల ఉసురుపోసుకుని భూస్థాపితానికి సిద్ధంగా ఉంది.

కాంగ్రెస్‌ పార్టీ దుస్థితిపై సీనియర్‌ సభ్యులు, సాను భూతిపరులను ఆందోళనకుగురి చేస్తుంది. లోక్‌సభ, రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల ధరావత్తు దక్కకపోవడం ఆంధ్రకు చేసిన అన్యాయంపై విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌ హామీ లిచ్చిన ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌, రాజధాని, పోలవరం వంటి నిర్మాణాలపై మొండిచేయిచూపే కేంద్ర ప్రభు త్వంకాంగ్రెస్‌కు పట్టినగతి పట్టకుండా అధికారంలో ఉన్న బిజెపి జనతాపార్టీ పునరాలోచించుకుని పరిస్థితి చేయి దాటకముందే ఆంధ్రప్రదేశ్‌ కు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలి.

అక్రమ దందా: -చర్లపల్లి వెంకటేశ్వర్లుగౌడ్‌, భూపాలపల్లి జిల్లా

రాష్ట్రంలో మినరల్‌ వాటర్‌ పేరిట కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం మూడు పువ్ఞ్వలు ఆరు కాయలుగా సాగుతుంది. పల్లెలు, పట్టణాలు, నగరంలో గుర్తింపు లేని వాటర్‌ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తు న్నాయి.

అనుమతులు లేకుండా నీళ్ల వ్యాపారం నడుస్తుంది. అధికారులు కూడా మామూళ్లకి ఆశపడి ఈ వాటర్‌ ప్లాంట్‌లవైపు చూడడం లేదు. మినరల్‌ నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులు, అనారోగ్యం బారినపడుతున్నారు..

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/