ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

రైతులను ఆదుకోవాలి:-గరిమెళ్ల రామకృష్ణ, గన్నవరం, కృష్ణాజిల్ల్లా

రాష్ట్రంలో అధిక వర్షాలతో పలుమార్లు వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

రాష్ట్ర ప్రభుత్వమే వరద నష్టం ఆరు వేల ఎనిమిది వందల కోట్లకుపైగా అంచనా వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.

రైతులు రుణాల ఊబిలో కూరు కుపోయి, పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రైతులకు కనీస సహాయం చేయ లేదు. మంత్రులు, అధికారులు నామమాత్ర పర్యటనలతో చేతులు దులుపుకున్నారు.

ప్రజాప్రతినిధులైతే కన్నెత్తిచూడటం లేదు. ఈ స్థితిలో రైతులకు రుణమాఫీ చేయడం అత్యవసరం. కేంద్ర,రాష్ట్ర పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలి.

ఆంక్షలు కఠినతరం చేయాలి: -పారేపల్లి సత్యనారాయణ, దేవులపల్లి, ప.గోజిల్లా

దేశంలో కరోనా విజృంభణ తగ్గలేదు. దశలవారీగా లాక్‌డౌన్ల సడలింపు ప్రక్రియ జరుగుతూ ఉంది.

కరోనా భయం తగ్గి, ప్రజలు మునుపటి కార్యకలాపాలు యధేచ్ఛగా సాగిస్తున్నారు. విందులు, వేడుకలు,వినోదాలు,కార్యక్రమాలు,భౌతిక దూరాన్ని పక్కనబెట్టి మరీ విచ్చలవిడిగా సాగిస్తున్నారు.

గ్రామాలలో అయితే ఏ మాత్రం భయంలేకుండా, ముఖానికి మాస్కు పెట్టు కోకుండా, భౌతికదూరాన్ని పాటించకుండా, వందల సంఖ్యలో జనాలు గుమ్మిగూడి వేడుకలు చేసుకుంటున్నారు.

ఇది తీవ్ర పరిణామాలకుదారితీస్తుంది అన్నవిషయం మరచిపోయి ప్రవర్తి స్తున్నారు.

ప్రభుత్వం పెళ్లిళ్లు, విందులు, వేడుకలు బహిరంగ కార్యక్రమాల అనుమతి విషయంలో కఠినంగా వ్యవహరించి ఆహ్వానితుల సంఖ్యను పరిమితం చేయాలి.

గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల ఉద్యోగస్తుల సమన్వయంతో పర్యవేక్షణ నిర్వహించి నిఘానుపటిష్టంచేయాలి.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

నేటికీ బాలకార్మిక వ్యవస్థ యధేచ్ఛ కొనసాగుతుంది. బడిఈడు పిల్లలు బడిలో ఉండాలి అనే నినాదం అది కేవలం నినాదంగా మాత్రమే ఉంది.

పలక,బలపం, పుస్తకాలు పట్టవలసిన చేతులు చాలా చోట్లఖార్ఖానాలు, హోటళ్లలోమగ్గుతున్నాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం ఉన్నప్పటికీ పిల్లల బాల్యం మాత్రం బందీగానే మిగిలిపోతుంది.

సంబంధిత అధికారులు బాలలను పనిలో పెట్టుకోకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

బాలకార్మిక చట్టాలు కఠినంగా అమలు కావలసిన అవ సరాన్ని సంబంధిత అధికారులు విస్మరించకూడదు.

ఒంటెద్దు పోకడ మానుకోవాలి:-సుగంధ శ్రీనివాస్‌, ఊటుర్‌, కరీంనగర్‌జిల్లా

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు తెలంగాణ ప్రభుత్వం ఒంటెద్దు పోకడ విధానాలకు చెంపపెట్టు లాంటివి.

నిధులు, నీళ్లు, నియా మకాల త్రయానికి తిలోదకాలు ఇచ్చి,కేవలం ప్రజలను సోమరు లుగా తయారు చేసే సంక్షేమ కార్యక్రమాలనే అభివృద్ధి పను లుగాప్రజలను తప్పుతోవపట్టించి పబ్బం గడుపుతోంది.

ఉన్నత విద్యావంతులు పనికిరాని మానవవనరులుగా భావించే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది. తలకు గాయమైతే మోకాలుకు మర్దన చేసే చర్యలు అన్నివేళలా ఉపయోగపడవని ప్రభుత్వం ఇకనైనాఅర్థం చేసుకోవాలి.

ప్రగతి భవన్‌కు, ప్రజల సమస్యలకు వారధి లేకుండాపోయింది. అన్నివేళలా,అందరినీ మోసం చేయ లేమని ప్రభువుల వారు ఇప్పటికైనా అవగతం చేసుకోవాలి.

ఇదికేవలం సూచనాత్మక తిరస్కారం మాత్రమే.

బైడెన్‌ పాలనలో మేలు జరగాలి: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజ లను భయభ్రాంతులకు గురిచేసిన ట్రంపు ఓటమి ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకునే నాయకులకు చెంపపెట్టు.

ప్రజాందోళన, న్యాయస్థానాల తీర్పులను పెడచెవిన పెట్టడం, వీసాలు రద్దు, దశాబ్దాలుగా స్థిరపడిన ఎందరో విదేశీయులతోపాటు భారతీ యులు కూడా ట్రంపుపాలనలో దినదినగండంనూరేళ్ల ఆయుష్షు బతికారు.

ప్రపంచదేశాల దౌత్య సంబంధాలపై ప్రతికూల నిర్ణ యాలతో కాస్తోకూస్తో అన్ని దేశాలతో సంబంధాలు బెడిసి కొట్టాయి.ప్రజలు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా ఈనాటికీ నేనే రాజు అనేటువంటి విధానం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే.

ట్రంప్‌ పాలనలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది ఉపాధికై వచ్చిన భారతీ యులను అక్కునచేర్చుకునే విధంగాబైడెన్‌ నాయకత్వంలో సం పూర్ణ రక్షణకల్పిస్తారని ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయి.

ఆన్‌లైన్‌ అడ్మిషన్లతో ఇబ్బందులు: – సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ఇంటర్మీడియేట్‌ అడ్మిషన్లలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ విధా నం లక్షలాది విద్యార్థులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఫీజుల విషయంలో అన్నికాలేజీలకు ఒకే విధానం ప్రవేశపెట్టడం వలన వెబ్‌ ఆప్షన్‌లలో సింహభాగం కాలేజీలు కనిపించడం లేదు.

ప్రైవేట్‌రంగంలోఉన్న2200కాలేజీలకు గాను కేవలం700 కాలే జీలు మాత్రం వెబ్‌ఆప్షన్లలో కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం రెండువందలు రిజిస్ట్రేషన్‌గా నిర్ణయించారు.

వెనుకబడిన తరగతుల వారికి రిజిస్ట్రేషన్‌ ఫీజులో సౌలభ్యం కల్పించలేదు. మొత్తంమీద ఆన్‌లైన్‌ విధానంగందరగోళానికి తెరలేపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/