ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

ప్రాణదాతలకు నోబెల్‌:-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని కలవరపెడుతున్న కాలేయ వ్యాధికి కారణ మవుతున్న హెపటైటిస్‌సి వ్యాధితో ఏటా నాలుగు లక్షల మంది చనిపోతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి.

కేన్సర్‌, సిర్రోసిస్‌ వంటి దీర్ఘకాల వ్యాధులకు కీలకంగా మారు తుంది.

రక్తమార్పిడి చేసుకున్నఆరోగ్యవంతులను కూడా అంతు చిక్కని రీతిలో విస్తరించి శాస్త్రవేత్తలకే సవాలు విసిరే పరిస్థితి. ప్రపంచం ఆరోగ్యసంస్థ గత యాభైసంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా శాశ్వత పరిష్కారం లభించలేదు.

ప్రాణాంతక వైరస్‌ గుట్టువిప్పి ఎట్టకేలకు హెపటైటిస్‌ సి వైరస్‌ను కనుగొన్న హార్వీజె ఆల్టర్‌,చార్లెస్‌ఎంరైస్‌, మైకేల్‌ హోటన్‌లు సాధించారు. వీరి పరిశోధనల ఫలితంగా కోట్లాది మంది ‘ప్రాణదాతలుగా నిలిచారు.వీరితోపాటు క్రిష్ణబిల అన్వేషకులకూ నోబెల్‌ (శాంతి) బహుమతి ప్రకటించడం అభినందనీయం.

చైనాకు బుద్ధిచెప్పాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

1959 నాటి వాస్తవాధీన రేఖకు కట్టుబడి ఉండాలంటూ చైనా లేవనెత్తిన సరికొత్త వాదనను భారత్‌ నిర్వింద్వంగా తిరస్కరించాలి.

సుమారు 50 సంవత్సరాలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ సమయంలో వాస్తవ సరిహద్దుల గురించి ఇటువంటి ఆమోదయోగ్యం కాని భాష్పాలను చైనా లేవనెత్తు తుంటే భారత్‌ గట్టిగా వాటిని తిప్పికొట్టాలి.

1959లో చైనా ఏకపక్షంలో నిర్వచించిన ఎల్‌ఎసిని భారత్‌ ఏనాడూ ఆమోదిం చలేదు. పాకిస్థాన్‌తో చేతులు కలిపి భారత్‌పై అనవసర ఒత్తిళ్లు తేవడం చైనాకు కొత్తకాదు.

ప్రస్తుతం ఉన్న ఎల్‌ఎసిని గుర్తిస్తూ 1993,1996,2005 ఒప్పందాలతోపాటుతాజాగా సెప్టెంబర్‌ 10న రెండు దేశాలమధ్య అవగాహన కూడా కుదిరిన అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై భారత్‌ తెలియచేయాలి.

మత్తుమాయలో యువత:-రాజు, పాల్వంచ

పిల్లలు బాగా చదువ్ఞకొని,పైకొచ్చి గొప్పజీవితం సొంతం చేసు కొని,వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటారని తల్లిదండ్రులు ఎంతో ఆశతో పిల్లలని చదివిస్తుంటే చాలా మంది పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అవ్వడం.

మాదకద్రవ్యాలు సేవిస్తూ చిన్న వయస్సులోనే దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులబారిన పడి, ప్రాణాలు కోల్పోవడం చాలా మంది తల్లిదండ్రులకు తీవ్ర గర్భ శోకం కలిగిస్తుంది.

ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించి, అంతులేని ధనార్జనే ధ్యేయంగా యువతని మత్తుకు చిత్తు చేస్తున్న ముఠాల్ని కనిపెట్టి శిక్షించాలి.

ట్రంప్‌ వల్ల ముప్పులేదనిపిస్తుంది: -డా.దన్నాన అప్పలనాయుడు, చీపురుపల్లి

ప్రపంచ ఆర్థిక, సాంకేతిక రంగాల అగ్రదేశాలలో అమెరికా ఒకటి.

అన్ని రంగాలలో తనదే పైచేయిగా ఉండాలని తపించి ఎదుటివారిలో తప్పున్నా లేకున్నా తేడా వస్తే సామదానభేదాల ను ఉపయోగించి తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించిలొంగని యెడల అవసరమైతే దండోపాయాన్ని ఉపయో గించి ముందు పాలించిన పాలకులు ఎన్ని దేశాల మీద యుద్ధాలు చేసి ప్రాణ ఆర్థిక నష్టాలను కలిగించి అణచివేతకు పూనుకున్నారో చరిత్రలో కనబడుతుంది.

ప్రస్తుత పాలకుడు ట్రంప్‌విషయానికొస్తే గతపాలకుల మీద నయమే అనిపిస్తుంది. ఎందుచేతననగా శతృదేశమైన ఉత్తర అమెరికా అధ్యక్షుడు కిమ్‌ తో బద్ధ శత్రుత్వమైనా, తనతో స్నేహహస్తమందించి యుద్ధం లేకుండా ప్రాణ,ధన నష్టాన్ని నివారించినట్లయింది.

ప్రజలను పట్టించుకోని పాలకులు: -మిథునం, హైదరాబాద్‌

మహారాష్ట్రలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం గురించి బిజెపి నాయకులు పట్టించుకోవడం లేదు. బాధితులకి సహాయ చర్య లు చేపట్టడంపై శ్రద్ధ చూపడం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్‌ అవ్ఞతూ ఠాక్రేపై ఒంటికాలుమీద లేస్తున్న నటి కంగనాను సపోర్ట్‌ చేస్తున్నారు.

ఆమెను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆమెతో పాటు వారు కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. ఇది కరోనా సమయం పార్టీలకి అతీతంగా అందరు ఏకమై పోరాడవలసిన సమయం. అనవసర విషయా లకి ప్రాధాన్యత ఇవ్వటం సరికాదు.

అభివృద్ధి పనులు చేపట్టాలి: – ఎం.ధర్మరాజు, రాజమండ్రి

ఆంధ్రప్రదేశ్‌లో రహదారులన్నీ పూర్తిగాపాడైపోయాయి. ఎక్కడి కక్కడ గోతులు, వర్షాలుపడి నీరునిల్వ ఉండడంతో వాహనాలు భారీ ప్రమాదాలకు గురవ్ఞతున్నాయి. అమ్మఒడి, నాడు-నేడు, చేయూత వంటి వినూత్న పథకాల ద్వారా వేల కోట్ల రూపా యలు సంక్షేమ పథకాలు చేపట్టడం మంచిదే!

అయినా కొత్త రాష్ట్రానికి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఈ పదిహేను నెలల్లో సంక్షేమానికి చూపిన శ్రద్ధ అభివృద్ధికి చూపడం లేదనేది జగమెరిగిన సత్యం.

సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు స్థాపిస్తే యువతకు ఉపాధితోపాటు రాష్ట్ర ఆదాయం పెరగగలదు. భావితరాల అభివృద్ధి దృష్ట్యా సదరు పనులు చేపట్టడంతోపాటు రహదారుల మరమ్మత్తులు, నూతన రహదారులు నిర్మించి అభివృద్ధి పనులు చేపట్టాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/