ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people-
Voice of the people-

ప్రభుత్వ గుప్పిట్లో పర్యావరణం: -పూసాల సత్యనారాయణ, హైదరాబాద్‌

మనిషి జీవనశైలి మారినా పర్యావరణాన్ని పూర్తిగా తరిమి కొట్టలేం. వాహనాలను పరిశ్రమలను కాలుష్యాన్ని సృష్టించే వాటిని, యంత్రాలను అదుపులో పెట్టేది అనుమతులు జారీ చేసేది ప్రభుత్వమే.చట్టాలను కఠినతరం చేసేది అమలు చేసేది ప్రభుత్వమే

గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాల వరకు కాలుష్య నివారణకు ప్రణాళికలు రూపొందించి చట్టాలను అతిక్రమించిన వారిపైకొరడా ఝుళిపించినప్పుడు కాలుష్యనివారణను అరికట్ట వచ్చు.

పంచభూతాలను సైతం మట్టి కరిపిస్తున్న కాలుష్యానికి ముక్కుతాడు వేయకుంటే రానున్న రోజుల్లో మనిషి బతికి బట్టకట్టలేడు. మనిషి మారాలి. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

దేవాలయాలపై దాడులు అరికట్టాలి:-యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై వరుసదాడులు జరు గుతున్నాయి. దాడులు ఎవరుచేసినా నిందితులను సకాలంలో పట్టుకుని చర్యలు తీసుకోకపోవడంతో కొంత మంది పేట్రే గిపోయి రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు.

దాడులు చేసిన నిందితులను సమగ్ర దర్యాప్తు జరిపి శిక్షించి శాంతిభద్రతలు కాపాడవలసిన ప్రభుత్వం దాడులను ఖండించిన ప్రతిపక్షపార్టీ, నేతలపై ఎదురుడాడికి దిగడంతో నిందితులు మరింత రెచ్చిపో తున్నారు.

దేవాలయాలపై ఇటువంటి దహనకాండ ఏ రాష్ట్రం లోనూ లేదు. దళితులు, దేవాలయాలపై విపరీతంగా వరుస దాడులుజరగడం మతాలకతీతంగా ఈరాష్ట్రంలో అన్నదమ్ము లుగా కలిసి జీవిస్తున్న అన్ని వర్గాల ప్రజలపై కుల,మత, విద్వేషాలు ప్రబలే ప్రమాదముంది.

ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలపై ప్రభుత్వం కలగచేసుకుని దోషుల ను కఠినంగా శిక్షించి దాడులను అరికట్టాలి.

పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లెప్రగతి కార్యక్రమం చక్కని ఫలితాలను ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం కార్యదక్షతకు నిదర్శనం.

కేబినెట్‌ సమావేశం లో ప్రధాని స్వయంగా ఈ కార్యక్రమంపై ప్రశంసలు కురి పించడం ఈ పథకం విజయంతం అయిందనడానికి నిద ర్శనం.హరితహారం మొక్కలు పర్యవేక్షణ, వైకురఠధామా లు, డంపింగ్‌ యార్డుల నిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగు పరచడం,కాల్వల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, కంపోస్టు షెడ్‌ల నిర్మాణం వంటి కార్యక్రమాల ద్వారా మొదటి విడతలో పల్లెల శోభనే మార్చివేసాయి.

నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలి:-ఎల్‌.ప్రఫుల్లచంద్ర, ధర్మవరం

ప్రస్తుతం కరోనా వేటుకు సామాన్యుడికి అవసరమైన నిత్యావ సర వస్తువ్ఞల ధరలు సైతంకొండెక్కి కూర్చున్నాయి.ఇక సామా న్యుడి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది.

అసలే కరోనా అందునా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈ ధరల పెరు గుదల ఒకసమస్య.కూరగాయల రేట్లు కూడా పెరిగిపోయాయి. ధరలు పెరుగుదల విషయం పాలక ప్రభుత్వం కాస్త పట్టించు కోవాలి.

కరోనాతో ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న సామాన్య ప్రజల విషయం అలావ్ఞంటే ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన రేట్లతో విక్రయిస్తున్నారు.

అలాంటి ధరలు నియంత్రించాలి. సామాన్యులను ఆదుకోవాలి. మార్కెట్‌లో ఏ వస్తువ్ఞ కొనాలన్నా విపరీతమైన రేట్లతో బెంబే లెత్తుతున్నారు. ఈ ధరలు తగ్గించేలా తగిన చర్యలు చేపట్టాలి.

మారని డాక్టర్ల చేతిరాత: -సింగంపల్లి శేషసాయికుమార్‌, రాజంపేట

గమెరిగిన సత్యం ఒకటి ఉంది. డాక్టర్లు రాసే రాత వారి వద్ద గల మందుల షాప్‌ వారికిమాత్రమే తెలుస్తుంది.

కానీ కొన్ని సంవత్సరాల క్రితం మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్లు మందుల చీటీని అందరూ చదవగలిగేలా పెద్ద అక్షరాలలో మాత్రమే రాయాలి లేక కంప్యూటర్‌ ప్రింట్‌ తీసి ఇవ్వాలని అదేవిధంగా మందుల పేర్లు రాసేటప్పుడు కచ్చితంగా వాటి

వ్యాపార పేర్లు కాకుండా మందుల కలయికలు రాసినట్లయితే ఆ ఓషధాన్ని ఏ మందుల దుకాణంలో అయినా కొనడానికి వీలుంటుంది.

అంతేకాక ట్రేడ్‌నేమ్‌ రాయడం వల్ల ఒక కంపెనీకే ప్రోత్సాహం ఇవ్వకుండా వినియోగదారునికి పూర్తి స్వేచ్ఛ కల్పించే వీలు ఉంటుంది.

అయోమయంలో విద్యార్థులు: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ఇంటర్‌, పాఠశాల విద్య విషయంలో రాష్ట్రప్రభుత్వం అను సరిస్తున్నఅస్పష్టత విధానాలవలన విద్యార్థులు తీవ్ర అయో మయానికి గురవుతున్నారు.

ఇంటర్‌ అడ్మిషన్లు, పాఠ్యాం శాల విషయమై ఎలాంటి ప్రకటన చేయకపోవడం వలన ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యాసంవత్సరంలో నాలుగునెలలు విద్యాసంస్థలు మూత బడినాపూర్తిస్థాయి ఫీజులుకట్టించుకుంటున్నాయి.

70 శాతం మంది ప్రైవేట్‌విద్యాసంస్థల వైపు మొగ్గుచూపగా, ప్రభుత్వ విద్యాసంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయోనని 30 శాతం ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/