ప్రజావాక్కు

స్థానిక సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

పొరుగు దేశాల దుశ్చర్యలను ఖండించాలి:-యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

భారతదేశం, పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దులో మన భూ భాగంలోకి చొరబడేందుకు భారీ సొరంగం తవ్వడం పాకిస్థాన్‌ దుశ్చర్యబహిర్గతమైనది.

సొరంగం ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదులను పంపితద్వారా మనదేశ సార్వభౌమ త్వాన్ని దెబ్బతీసేందుకు పన్నిన కుట్రను గమనించిన మన బిఎస్‌ఎఫ్‌ జవానులు అభినందనీయులు.

ఇటీవల చైనా సరి హద్దులో ఇరవైమంది వీర సైనికులను పొట్టనపెట్టుకున్న దుర్ఘ టన మరువక ముందే మరో పొరుగుదేశం దుస్సాహసానికి పూనుకోవడం భయాందోళనలకు గురి చేస్తుంది.

అలాగే సరి హద్దులోగల జమ్మూ,పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలు అప్రమత్తం కావాలి. పాకిస్థాన్‌, చైనా మనదేశంపై ప్రత్యక్షంగా కయ్యానికి కాలుదువ్ఞ్వతున్న వైనాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాలి.

తెలుగువారంటే ఎప్పుడూ అలుసే:-డా.దన్నాన అప్పలనాయుడు, చీపురపల్లి

మొదట తెలుగువారం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం.

ఆంధ్రరాష్ట్రంకోసం, ఆంధ్రప్రదేశ్‌ కోసం, వాటిని సాధించడం కోసం మద్రాసు రాష్ట్రాన్ని, మద్రాసు రాష్ట్రానికి కామధేనువుగా ఉన్న మద్రాసు నగరాన్ని, దాని రాబడిని, దాని సరిసంపద లను, వాటిలోని మన భాగాన్ని విస్తరిస్తే తప్ప, త్యాగం చేస్తే తప్ప ఆనాడు మనకు ప్రత్యేక రాష్ట్రం రాలేదు.

తెలంగాణ విభ జన ఆంధ్రు ల అయిష్టంగా జరిగింది.

హక్కుల సాధనకోసం కేంద్రంలో పోరాటం బూడిదలో పోసిన పన్నీరవ్ఞతుంది. అన్నీ తెలిసిన వాళ్లం వాళ్ల అవసరాలకు సహకరిస్తున్నాం. మన అవసరాలకు రిక్తహస్తాలు చూపిస్తున్నారు. ఎప్పుడు?ఎలా? సాధించగలం. భవిష్యత్తులో సాధ్యమేనా?

ఆంక్షలు సడలించాలి: -ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

దేశవ్యాప్తంగా ఆగస్టు ఒకటినుండి ఆన్‌లాక్‌-3 ప్రక్రియ ప్రారం భమైనప్పటికీ అంతరాష్ట్ర ప్రయాణాలపై వివిధ రాష్ట్ర ప్రభు త్వాలు ఆంక్షలు కొనసాగించడం సరికాదు.

ప్రజల రాకపోక లు, వస్తువుల రుణాలపై ఇంకా నిషేధాజ్ఞలు కొనసాగించడం వలన ఆర్థిక కార్యాకలాపాలకు భంగం కలగడంతోపాటు ఉద్యో గులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

కొన్ని రాష్ట్రాలు ఈ-పాస్‌లు, ఈ పర్మిట్‌ల సాయంతో ప్రయాణాలు కొనసాగిం చవచ్చునని తెలిపినా ఈపాస్‌లు ఎక్కడ లభ్య మవ్ఞతాయో తెలియక అందరూ అయోమయానికి గురవుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

ఆధునిక జీవనశైలి మనిషి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

అధిక రక్తపోటు,మధుమేహం, గుండెజబ్బులు, ఊపిరి తిత్తుల సమస్యలు, కాలేయం వైఫల్యం వంటి ప్రాణాంతక వ్యాధుల రూపంలో ముప్పేట దాడి చేస్తూ మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది.

ముఖ్యంగా ఉదహరించిన వ్యాధుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా మొదట అయిదు స్థానాలలో ఉన్నాయన్న జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే నివేదిక ఆందోళన కలిగిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రా లలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల ముప్పును నివారించేం దుకు ప్రభుత్వాలు తక్షణం ఆరోగ్యపరిరక్షణ చర్యలు చేపట్టాలి.

శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహార పదార్థాలలో కల్తీ, అహారం తోపాటు నీరు,గాలి, కలుషితం కావడం, ఒత్తిడి పెరగడం, మద్యపానం, ధూమపానం చేసేవారి సంఖ్య గణనీయంగా పెరగడం వంటివి ప్రధాన కారణాలు.

ఆక్సిమీటర్లను ఏర్పాటు చేయాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

కరోనా వలన మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం రోగులకు ముందుగానే పల్స్‌ ఆక్సిలేటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించి 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్‌ ఉన్నట్లయితే వారిని తక్షణం ఆస్పత్రులకు పంపించాలి.

ఈ ప్రక్రియలో గ్రామస్థాయిలో కార్య దర్శులను,సచివాలయ మెంబర్లను భాగంచేయాలి. సాధ్యమైనంత త్వరగా ఆక్సిమీటర్లను గ్రామస్థాయిలో ఏర్పాటు చేసేందుకు యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలి.

ప్రతీ వ్యక్తి మాస్కులు ధరించేందుకు వాటిని ఉచితంగా పంపిణీచేయాలి.

పారి శుద్ధ్యం మెరుగుపరచడంతోపాటు గ్రామాలలో భౌతికదూరం విధిగా పాటించేలా విధి విధానాలను రూపొందించాలి.

కరోనా వ్యాప్తికిముఖ్యకారకమైనసమావేశాలు,సదస్సులు,మద్యంషాపుల నిర్వహణ వంటి అంశాలపై నియంత్రణ పాటించాలి

బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి:-షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ఇటు తెలంగాణ రాష్ట్రానికి అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వారధి గా ఉన్న నాగలదిన్నె బ్రిడ్జి 2009 సంవత్సరంలో వచ్చిన వర దలకు పూర్తిడి పోయింది.

ఈబ్రిడ్జి పనులు జరుగుతున్నప్పటికీ చాలా ఆలస్యంగా పనులు నడుస్తున్నాయి. నవంబర్‌ నెలలో తుంగభద్రనదికి పుష్కరాలురాబోతున్నాయి.

తెలంగాణ ప్రాంతం వారు మంత్రాలయానికి కూడా ఎక్కువరాకపోకలు కొనసాగి స్తారు. ఈ బ్రిడ్జి తయారు అయితే ప్రయాణం చాలా సులభం అవుతుంది.

ఈ వంతెన పూర్తయితే చాలా లాభాలు ఉన్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/