ప్రజావాక్కు

సామాజిక సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య:- ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పది శాతం ఈడబ్ల్యుఎస్‌ రిజర్వే షన్లను తక్షణం అమలు చేయాల్సిన అవశ్యకత ఎంతో ఉంది.

అగ్రకులాలకు చెందిన అనేక పేద కుటుంబాలలో నిరుద్యోగ యువత ఎంతో ప్రతిభావంతులై ఉండి, ఉద్యోగాలు రాక, పెళ్లి ళ్లుకాక, తల్లిదండ్రులకుపెనుభారమై దినదిన గండంగాబతుకు ఈడుస్తున్నారు.

ఇటువంటి వారిని ఉద్ధరించేందుకు కేంద్రప్రభు త్వం ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చట్టం చేసి రెండేళ్లు అయింది.

2019 ఫిబ్రవరి ఒకటి నుండి అన్ని కేంద్రప్రభుత్వ విద్యాలయాలలో, ఉద్యోగాలలో ఈడబ్ల్యుఎస్‌ వర్గాలకు రిజర్వేషన్లు అమలవుతున్నారెండు తెలు గు రాష్ట్రాలలో ఈ చట్టం ఇప్పటివరకు అమలుకాకపోవడం దుర దృష్టకరం.

ఉద్యోగాలకు సంబంధించి జి.వో విడుదల కాని కారణంగా గత రెండేళ్లుగా అగ్రకులాలలోని పేద నిరుద్యోగ యువత ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కోల్పోయాయి.

మనిషిని కుప్పకూలుస్తున్న కరోనా :-సింగంపల్లి శేషసాయికుమార్‌, రాజంపేట

కరోనా వైరస్‌ కొందరిలో లక్షణాలు ఉన్నట్లుగా కూడా చూప నప్పటికీ,మరి కొందరినిమాత్రం నిమిషాలలోఉన్న చోట కుప్ప కూలుస్తున్నది.

దీనిదాటికి భయపడి కనీసం కుటుంబ సభ్యులు కూడా దరిచేరడంలేదు.

ఆయాసం,శ్వాసతీసుకోవడంలో ఇబ్బం ది, గుండెపోటులతో మనిషి జీవితాన్ని హరిస్తున్నది. మరికొద్ది మంది అయితే తమకు పాజిటివ్‌ అని తెలిసిన వెంటనే మాన సికంగా కృంగిపోయి ఆభయంతో చనిపోతున్నారు.

దీని నుండి కోలుకోవడానికి శారీరక పటుత్వంతోపాటూ మానసిక నిబ్బరం కూడా ఎంతో అవసరం. దీనికి కుటుంబ సభ్యులతోపాటూ సమాజం సహకారం తప్పక కావలసి ఉంటుంది.

రాయలసీమలో నీటికి కరవు: -కాయల నాగేంద్ర, హైదరాబాద్‌

రాయలసీమలో వర్షాలు సరిగా కురవదు. దాంతో తాగడా నికి మంచినీళ్లుకూడా దొరకడంకష్టమైపోతూ చాలా గ్రామా లలో కరవు విలయతాండం చేస్తూఉంటుంది.

ఎన్ని సంవ త్సరాలు గడిచినా,ఎన్ని ప్రభుత్వాలు మారినా పరిస్థితులు మాత్రం మారలేదు.

రాయలసీమ నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులుఅయ్యారు.కానీ రాయలసీమ ముఖచిత్రం లో మార్పురాలేదు. ఇప్పటివరకు రాయలసీమ గురించి పట్టించుకునేవారులేరు.

పంటలకు కాదు తాగడానికి కూడా నీటికరవ్ఞ ఉంది. శాశ్వత నివారణ చర్యలు చేపడితే తప్ప రాయలసీమ కరవ్ఞ రక్కసి నుంచి తప్పించలేరు.

ప్లాస్మాథెరపీతో కరోనాకు చికిత్స: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

కరోనావైద్యంలోప్లాస్మాథెరపీ ఒకకీలకమైన అంశంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో 60 మందిరోగులకు ప్లాస్మా థెరపీ అందించడం వలన ప్రాణాపాయ పరిస్థితుల నుండి కోలుకున్న వార్త వైద్యవర్గాలలో ఆశావాహకంగా మారింది.

ఢిల్లీ ప్రభుత్వం అత్యవసరంగా ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేసి ప్లాస్మా దానం చేసేవారికి బహుప్రోత్సాకాలను సైతం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగు తున్నందున ప్లాస్మా బ్యాంకులు తక్షణం నెలకొల్పాలి.

కరోనా బారినుండి కోలుకున్న వారు స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేస్తే మరి కొందరికి ప్రాణదానం చేసిన వారవ్ఞతారు. అంతేకాకుండా సాధారణ రక్తనిల్వలు అత్యల్పస్థాయికి పడిపోయిన నేపథ్యంలో రక్తదాన శిబిరాలు విరివిగా ఏర్పాటు చేయాలి.

కాంగ్రెస్‌కు గుణపాఠం:-సి.ప్రతాప్‌,శ్రీకాకుళం

వరుసగా రెండు లోక్‌సభఎన్నికలలో పరాజయంపొందిన తర్వా త కూడా కాంగ్రెస్‌ పార్టీ తగిన పాఠాలను నేర్చుకోకపోవడం విచిత్రం.ఆ పార్టీకి జాతీయస్థాయిలో అధ్యక్షుడే లేకపోవడం నిజంగా బాధాకరం.

పార్టీలో యువతకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామన్న సోనియా, రాహుల్‌గాంధీల వాగ్దానం నీటిమీద రాతలుగా మిగిలిపోయింది.

ఫలితంగా అసంతృప్తి, అంతర్యుద్ధ కలహాల కారణంగా మధ్యప్రదేశ్‌, కర్ణాటకలలో అధికారం కోల్పో గా ఇప్పుడు రాజస్థాన్‌లో అదే పరిస్థితి ఎదురయింది.

పార్టీలో సీనియర్లదే హవా కొనసాగుతుండడం వలన యువత తీవ్ర అసంతృప్తికిగురై పార్టీకి దూరమవుతోంది. సీనియర్లు,జూనియర్ల మధ్య సమన్వయం సాధించడంలో సోనియా, రాహుల్‌ ఇద్దరు దారుణంగావిఫలమయ్యారు.

పార్టీలోయువనేతలను సమీకరించి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో కూడా సరైన వ్యూహం అమలుపరచలేకపోవడం ఆ పార్టీ నాయకుల ఘోరవైఫల్యం.

తెలుగును మరిచిపోకూడదు: -సయ్యద్‌ ఇబ్రహీం, హైదరాబాద్‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరాఠీలో పనిచేయని అధికారు లకు జీతం పెరుగుదల ఉండదంటారు. ప్రతిపక్షపు నాయ కుడు ప్రభుత్వఆదేశాలు మరాఠీలోనే ఉండాలంటారు.

మన దగ్గర తెలుగే రానివారు మంత్రులవ్ఞతున్నారు. ఇప్పుడు ముఖ్య మంత్రులుకూడా అవుతున్నారు. కాబట్టి అధికారం లో ఉన్నపార్టీలు,ప్రతిపక్ష పార్టీలు తెలుగు గురించి పట్టించు కోరు.

ప్రజలయినా పట్టించుకోకపోతే తెలుగుతల్లి తలదిం చుకునే పరిస్థితి వస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/