ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

స్థానికులకే ఉద్యోగాలు: – సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

నల్గొండ,ఖమ్మం,కరీంనగర్‌ జిల్లాల్లో అనేక పరిశ్రమలు విజయ వంతంగా పనిచేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చొరవతో భవిష్యత్తులో అనేక పరిశ్రమలు ఇక్కడ రానున్నాయి. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ నేటి వరకు 80 శాతం స్థానికేతరులే ఉపాధి పొందుతున్నారు.

ముఖ్యంగా తక్కువ వేతనాలకు పనిచేసేందుకు సముఖంగా వ్ఞండే బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, యుపి, ఒడిశా రాష్ట్రాల నుండి వేలసంఖ్యలో ఇక్కడ పనిచేస్తుండడం గమనార్హం.

ఈ ఫ్యాక్టరీల నిర్మాణంకోసం ఎన్నోరకాల భూము లను ఇచ్చిన వారికి నిబంధనల ప్రకారం పరిహారం ఇచ్చి §జమాన్యాలు చేతులుదులుపుకున్నాయి తప్పితే వారి కుటుం బాలలో ఎవ్వరికీ ఉపాధికల్పించలేదు. కాబట్టి తెలంగాణ ప్రభు త్వం ఇక్కడ వచ్చే పరిశ్రమలలో కనీసం 80 శాతం ఉద్యోగా లు స్థానికులకే కేటాయించేలా చట్టం తీసుకురావాలి.

డిగ్రీ కోర్సులకు తగ్గుతున్న ప్రాధాన్యత: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

దేశంలోని డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యత రోజురోజుకు తగ్గిపో తోంది. ఇంటర్‌ తర్వాత ఇంజినీరింగ్‌, ఫార్మసీ, కామర్స్‌ లేదా వైద్యం కోర్సులలో చేరేందుకు మాత్రమే విద్యార్థులు ఆసక్తి కన బరుస్తుండడంతో డిగ్రీకోర్సులకు పూర్తిగా ఆదరణ కరవైంది.

ఈ నేపథ్యంలో డిగ్రీ కోర్సులను మరింత పటిష్టంగా, ఉపయు క్తంగా తీర్చిదిద్దేందుకు కేంద్రప్రభుత్వం సన్నహాలు చేయడం హర్షణీయం.

డిగ్రీ మూడేళ్ల కాలంలో కనీసం ఆరు నెలలపాటు అప్రెంటీస్‌షిప్‌ లేదా లైఫ్‌స్కిల్స్‌ కోసం కేటాయించడం, సాఫ్ట్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌విద్యలో నైపుణ్య కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నాయకత్వ లక్షణాలపై ప్రత్యేక సిలబస్‌లు విద్యార్థులకు ఎంత గానో ఉపయోగపడతాయి.

డిగ్రీ చదువుతున్న సమయానికి జాబ్‌వర్క్‌పై అవగాహన కలిగి కోర్సుపూర్తికాగానే ఉద్యోగావ కశాలతో పాటు నైపుణ్యం కూడా పెరుగుతుంది.

మద్యం దుకాణాలను మూసివేయాలి: -గరిమెళ్లరామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్‌ ఉధృతి తీవ్రమవ్ఞ తున్న నేపథ్యంలో పలు పట్టణాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు

అధికారులు అత్యవసరం కాని వ్యాపార సంస్థల కార్యకలాపాలను కూడా నియంత్రించడం ప్రజలను అనవసరంగావీధులలోకి రాకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలను కూడా మూసివేయ డం చాలా అవసరం. నిజానికి మద్యం దుకాణాల వద్ద ఎటు వంటి నిబంధనలను పాటించడం లేదు.

బ్యాంకుల పనితీరుపై దుష్ప్రభావం:-ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

కరోనా-19 మహమ్మారి ప్రతికూల ప్రభావం వలన దేశీయ బ్యాంకింగ్‌ రంగం ఆర్థికసంక్షోభంలో చిక్కుకుందని, ఇందులో నుండి బయటపడేందుకు కనీసం 20 సంవత్సరాలు పడుతుందన్న ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ అధ్యయన నివేదికపట్ల ప్రభుత్వం తక్షణంస్పందించాలి.

మార్చి31, 2021 నాటికి రుణవ్యయాలు పెరగడం,మొండిబకాయిలలో22 శాతం వృద్ధి, డిపాజిట్లు, రుణాలలో క్షీణత, ఎన్‌పిఏ అత్యధికంగా 15 శాతానికి పెరగడం వంటి అంశాలు దేశీయ బ్యాంకులను తీవ్ర సంక్షోభంలోనికి నెట్టుతున్నాయి.

2020-22 మధ్య ఎన్‌పిఎల్‌ రికవరీలో 100బేసిక్‌ పాయింట్ల వృద్ధి మాత్రమే నమోదు చేసు కోవడం,ఆత్మనిర్భర్‌ భారత్‌లోభాగంగాపరిశ్రమలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయ రంగానికి అతితక్కువ వడ్డీలకే భారీ రుణాలు వంటివి బ్యాంకుల పనితీరుపై దుష్ప్రభావం కనబరుచనున్నది.

దేశీయ బ్యాంకింగ్‌ రంగాన్ని రక్షించేందుకు కేంద్రప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.

అయ్యో కాంగ్రెస్‌: -డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ముఖ్య మంత్రి గెహ్లాట్‌, ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ గ్రూపు రాజకీ యాలు నడుస్తున్నాయి.నేడు అవిమరింతముదిరిపోగా పైలట్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం పదవ్ఞల నుండి తొలగించింది.

ఈ పరిస్థితి నెలకొనడం పూర్తిగా కాంగ్రెస్‌ అధిష్టానం స్వయంకృతం. ప్రస్తు తానికిఈ చర్యవల్లరాష్ట్రంలోఅధికారంకోల్పోకపోయినా ముందు ముందు ఆ పరిస్థితి కూడారావొచ్చు.పైలట్‌ యువకుడు. ఎంతో కొంత జనాకర్షణ ఉంది.

గత ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంలో ఆయనపాత్ర ఎక్కువగానే ఉంది. ఆయనకు ఉపముఖ్యమంత్రికి మధ్య బేధాభిప్రాయాలు కొత్తవికావ్ఞ. ఎన్నికల ముందు నుండి ఉన్నవే.కాంగ్రెస్‌లోపాతతరం, కొత్తరక్తం మధ్య కొనసాగుతున్న అగాధాల్ని పూడ్చడానికి అధినాయకత్వం చేసిందేమీ లేదు.

విద్యారంగంలో మార్పులు అవసరం: -పి.కుమార్‌, మెదక్‌

కరోనా వల్ల విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేప థ్యంలో విద్యార్థులు నష్టపోకుండా విద్యారంగంలో సమూల మైన మార్పులు తేవాలి. ప్రభుత్వపాఠశాలలను బలోపేతం చేస్తూ,అవసరమైన మేరకుమాత్రమే ప్రైవేట్‌బడులకు అనుమతు లిస్తూ డి.ఎడ్‌, బి.ఎడ్‌ చేసిన చాలా మంది నిరుద్యోగులతో ప్రభుత్వ పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/