ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

పెరుగుతున్న అప్పుల భారం:- ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసినా రాజకీయ పార్టీలు ఎన్ని కలకు ముందు ఉచిత పథకాలను ఎడాపెడా ప్రకటించేస్తున్నా యి. అధికారంలోకి వచ్చాక పార్టీలు తమ హామీలను నిల బెట్టుకునేందుకు ఎడాపెడా అప్పులు చేసేస్తున్నాయి.

అందుకే రాష్ట్రాల రుణభారం ఏటా పెరిగిపోతోంది. 2016-17 సంవ త్సరంలో38లక్షల కోట్లరుణభారం 2019-20ఆర్థిక సంవత్స రంలో 53 లక్షల కోట్లకు పెరగడం పట్ల నీతి ఆయోగ్‌తోపాటు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రుణగ్రస్త రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌లు తొలి ఆరుస్థానాలలో ఉన్నాయి. అప్పుల భారాన్ని తగ్గించేందుకు నేందుకు రాష్ట్రాలు జిఎస్టీని పెంచాలని డిమాండ్‌ చేయడం ప్రజాసంక్షేమ స్ఫూర్తికి విరుద్ధం.

మహిళా హక్కులను పరిరక్షించాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

నేటితరం మహిళలు ఉన్నత చదువులతో మందుకు వెళ్తున్నా రు. కాని వారిపై అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు.

లింగవివక్షపైనా, దాని నిరోధక చట్టాలపైనా యుక్తవయస్సు నుండే పిల్లల్లో అవగాహన పెంచాలి. అందువలన మగపిల్ల లకు తమ హద్దులు తెలిసిరావడం, ఆడపిల్లలను తమ హక్కు లపై అవగాహన పెరుగుతుంది.

మహిళలు తాము పనిచేసే కార్యాలయాలలో, ఇళ్లల్లోకూడా వేధింపులకు గురవ్ఞతున్నారు. బాల్యం నుండి ఆడపిల్లలకు స్వేచ్ఛ, సమాన అవకాశాలు కల్పించడం, వాటిని వారు ఎలాంటి బెరుకులేకుండా ఉపయో గించుకునేలా చూడడం ఎంతో ముఖ్యం.

పాశ్చాత్య నాగరికతవైపు యువత మొగ్గు: -కె. అన్నపూర్ణ, విశాఖపట్నం

నేటి సమాజం పాశ్చాత్య నాగరికత వైపు అడుగులేస్తోంది. కంప్యూటర్‌ చదువ్ఞలు, టెక్నికల్‌ కోర్సులు, విదేశీ భాషా కోర్సులు విదేశీ కోర్సులు వగైరా మార్పులకు అనుగుణం గా మారడం తప్పుకాదు. కాని భారతదేశంలో మార్పులు రావడం దురదృష్టకరం.

చదువ్ఞలు ఉపాధి కోసం మార వచ్చు.కానీ భారతీయతను వదిలిపాశ్చాత్య సంస్కృతులపై ఆకర్షణ పెరుగుతోంది. నేడు సహజీవనం, అక్రమ సంబం ధాలు, డేటింగ్‌, చాటింగ్‌లు, వివాహనం చేసుకుంటామని ఆర్థికంగా మోసగించేవారూ ఎక్కువవుతున్నారు.

నిలువునా మునుగుతున్న అన్నదాతలు: -జి.భారతీదేవి, ఏలూరు, ప.గోజిల్లా

ప్రకృతి వైపరీత్యాలకు తోడు కరోనావైరస్‌ ఉధృతితో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిమ్మ, అరటి, ఇతర పండ్ల తోటల రైతుల పరిస్థితి దయనీయం, మరి ఈ రైతులను ఎలా అదుకోదలచారో పాలకుల నుంచి నిర్దిష్టమైన హామీ ఇంతవరకు లేదు.

మరోవైపు జొన్న, మొక్క జొన్న, శనగ పంటలకు మద్దతు ధర కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్లు భావించాల్సి వస్తున్నది.

రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు సరిగా చేయటం లేదు. మరి గత బడ్జెట్‌లో కనీస మద్దతు ధరల కోసం పెట్టిన మూడు వేల కోట్ల రూపాయాలు అసలు వినియోగించనేలేదు.

ఇబ్బడి ముబ్బడిగా తీసుకు వచ్చిన వేల కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారో అంతుచిక్కకుండా ఉంది. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సమగ్రంగా అమలు చేసిన దాఖలాలు ముఖ్యం. రైతుల సమ స్యలపై రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలబడాలి.

ప్లాస్టిక్‌ను పారేద్దాం:-వివేక్‌, విశాఖపట్నం

మన పూర్వీకులు ప్రకృతివనరులతో తయారు చేసిన వస్తువ్ఞల ను ఉపయోగించేవారు. నేటి ఆధునిక యుగంలో ప్రజలు ప్లాస్టిక్‌ వస్తువ్ఞల మోజులో పడ్డారు.

ఈ రోజు మనం కూర్చునే కుర్చీ నుండి తినే ఆహార పాత్రల వరకు ప్లాస్టిక్‌ వాడుతున్నాం.

ప్లాస్టిక్‌ వస్తువ్ఞలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయి. వాడ డం, పారేయడానికి అలవాటు పడిన ప్రజలు మట్టితో చేసిన వస్తువ్ఞలు వాడటానికి ఇష్టపడటం లేదు.

ప్లాస్టిక్‌ మనకే కాదు భూమిని కూడా పాడుచేస్తుంది. వాడిపారేసిన ప్లాస్టిక్‌ మట్టిలో కలవకపోగా అలాగే ఉండి పంటలు పండకుండా చేస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌ను నివారిద్దాం.

నిరుద్యోగులను ఆదుకోవాలి: -సయ్యద్‌ షఫీ, హన్మకొండ

పేదరికంవల్ల ఎన్నోసమస్యలు ఉత్పన్నమవ్ఞతాయి. మోసా లు, దొంగతనం, హింస లాంటి నిషిద్ధ కర్మలు పెరిగిపోతాయి.

కోట్లాది మంది విద్యార్థులు పిజిలు పూర్తి చేసుకుని రోడ్లపై కొస్తారు. వారికి ఒనగూడేదేమీ లేదు. వ్యవసాయం చేసుకుంటే బాగుండును అనవసరంగా చదువ్ఞల ఊబిలో చిక్కుకున్నామనిపిస్తోంది.ఎక్కడికెళ్లినా ‘నోవెకన్సీ బోర్డులు స్వాగతంపలుకుతాయి.ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.

తాజా సినిమా వార్తల కోసం:https://www.vaartha.com/news/movies/