ప్రజావాక్కు

సమస్యలపై ప్రజల గళం

Voice of the People
Voice of the People

ఆధునిక స్కానర్లను ఏర్పాటు చేయాలి:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌,నల్గొండ

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి ప్రారంభ కేంద్ర మైన అలిపిరి టోల్‌గేట్‌ వద్ద మున్సిపల్‌ తనిఖీల కారణంగా ఆలస్యం అవుతోంది.తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో ఘాట్‌ రోడ్‌ నుండి వాహనాలు వెళ్తుంటాయి. తుపాకులు, మద్యం, మాంసం వంటి నిషేధిత వస్తువ్ఞలు తిరుమలను చేరకుండా సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అయితే వాహనాలలోని వస్తువ్ఞలను కిందకు దించి తనిఖీలు చేస్తుం డడం వలన ఆలస్యం అవుతోంది. కాబట్టి విమానాశ్రయాలు, నౌకాశ్రయాల మాదిరిగా ఆధునిక స్కానర్లను ఏర్పాటు చేస్తే వాహనాలలోని వస్తువ్ఞలన్నింటినీ ఏకకాలంలో స్కాన్‌ చేసి నిషేధిత వస్తువ్ఞలను గుర్తించే వెసులుబాటు కలుగుతుంది. వృద్ధుల వికలాంగులు వాహనంలోఇంచి కిందకు దిగాల్సిన అవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవ్ఞతుంది.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

జనాభా ప్రాతిపదికపై రాష్ట్రాలు నిధులు, పన్నులలో వాటా, అభివృద్ధి పథకాలు, చివరకు పార్లమెంట్‌ సీటు కేటాయించాల న్నఆర్థికసంఘం సిఫార్సులుఅసంబద్ధంగా ఉన్నాయి. 1970- 80 దశకంలో జనాభా కట్టడి చేసే విధానంపైనే నిధుల కేటా యింపు జరిగేది.

ఈకాలంలో జనాభా నియంత్రణపై దక్షిణాది రాష్ట్రాలు ఖచ్చితమైన ప్రణాళికలు అమలు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించాయి. ఉత్తరాది రాష్ట్రాలు అధిక జనాభాకు కారకులయ్యాయి.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవస రాల దృష్ట్యా జనాభా ప్రాతిపదికపైనే కేటాయింపులు అంటూ కొత్త విధానం తీసుకువచ్చి ఉత్తరాది రాష్ట్రాలకు పరోక్షంగా మేలు చేయాలని చూస్తోంది. ఇందువలన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం కలుగుతుంది.

నిరుద్యోగాన్ని నిర్మూలించాలి:-కె.రామకృష్ణ, నల్గొండ

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలోని ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరం జనవరి మాసంలోనే ఖాళీలను ప్రకటించి భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గత శాసన సభ సమావేశాల్లో ప్రకటించారు.

ముఖ్యమంత్రి ప్రకటనతో రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా రు. అయితే ఆ దిశగా ఎటువంటి ప్రక్రియ మొదలైన దాఖలా లులేవ్ఞ. రాష్ట్రపాలకులు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లకుండా భర్తీ ప్రక్రియను వెంటనే మొదలుపెట్టి వేగవంతం చేయాలి.

అనుమతులు లేని కాలేజీలను సీజ్‌ చేయాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

రెండు తెలుగు రాష్ట్రాలలో నకిలీ జూనియర్‌ కాలేజీల హవా అప్రతిహతంగా సాగుతోంది. ఇంటర్‌బోర్డు ధృవీకరించిన కాలేజీ లతో అనుసంధానంచేసుకొని, ఎలాంటి అనుమతులు లేకుండా వాటి అనుబంధ కాలేజీలుగా అనధికారికంగా వందలాది కాలే జీలు నడుస్తున్నాయి.

అపార్టుమెంట్లు,షాపింగ్‌కాంప్లెక్సు, గ్రూప్‌ హౌసింగ్‌లలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ కాలేజీ లను నడిపిస్తున్నారు.

సమాజంలో పేరుపొందినవారు, పారిశ్రా మికవేత్తలు ఈ కాలేజీలు నడుపుతుండడం వలన వారిపై చర్య లు తీసుకోవడానికి విద్యాశాఖ వెనుకాడుతోంది.

అగ్నిమాపక శాఖ ఆర్‌అండ్‌బి లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంజినీర్‌ నుండిభవనం పటిష్టత గురించి ఎన్‌జి.సిలు ఇంటర్‌బోర్డు అను బంధ గుర్తింపులుపొందాలన్న నిబంధనలకు నీళ్లోదిలేస్తున్నారు.

సంస్కరణలు అవసరం:-ఎం.కిషోర్‌, నల్గొండ

స్థానిక ఎన్నికలలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఆంధ్రప్ర దేశ్‌ మంత్రివర్గం చట్ట సవరణలను చేపట్టడం హర్షణీయం.

పంచాయతీ, ఎంపిటిసి,జడ్పీటిసి పురపాలికఎన్నికల నిర్వహణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, వాటిలో పోటీచేసే అభ్య ర్థులుఅక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకునేలా చట్టసవ రణలు చేయడం మంచి చర్చ.

స్థానికఎన్నికలలో గతంలోకాకుండా ధన, మద్యం, ప్రభావం అక్రమాలు తగ్గించేందుకు నోటిఫికేషన్‌ నుండి ఎన్నికల వరకు సమయాన్ని 15 రోజులకే తగ్గించడం ఓటుకు డబ్బులు పంచడం మద్యం పంపిణీ చేయడం, కులం, మతం పేరిట ప్రేరేపించడం వంటి నియమాలను ఉల్లంఘించిన అభ్యర్థులపై అనర్హతవేటు తప్పకవేయాలి.

వివాదాస్పద నిర్ణయాలు:-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి వివాదా స్పద నిర్ణయాల వలన కేంద్రప్రభుత్వం, న్యాయస్థానాల నుండి పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు.

పోలవరంప్రాజెక్టు, విద్యు త్‌శాఖల రివర్స్‌ టెండరింగ్‌,ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు, మూడు రాజధానులు, శాసనమండలి రద్దు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు వంటి పలు నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రతిష్ట మంట గలుస్తోంది.

వీరికితోడుగా తందాన తాన అనే మంత్రివర్గం, సలహదారులు, పోలీసు వ్యవస్థ,అధికారులు ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు పోటీప డుతూ రాష్ట్ర ప్రతిష్టను మరింత దిగజార్చుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/