ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

బర్డ్‌ఫ్లూపై అప్రమత్తత ముఖ్యం:-చర్లపల్లి వెంకటేశ్వర్లుగౌడ్‌, భూపాలపల్లి జిల్లా

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రజలను కలవరానికి గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా వలస పక్షులతోఈవ్యాధి ప్రబలే అవకాశంఉందని తెలుస్తుంది. వివిధ ప్రాంతాలలో ఈవ్యాధి ప్రబలిపక్షులు మృత్యువాత పడుతున్నా యి. ప్రస్తుతం రాజస్థాన్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, తదితర రాష్ట్రాలలో వేలాదిగా కోళ్లు, బాతులు, కాకులు, నెమళ్లు బర్డ్‌ఫ్లూ సోకి మరణిస్తున్నాయి. వలస పక్షుల వల్లనే ఏవియస్‌ ఇన్ల్ఫుఎంజా వైరస్‌ వ్యాప్తి చెందుతూ ఉందని పరి శోధకులు గుర్తించారు.మన రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పౌల్ట్రీ రంగం వారికియాజమాన్యానికి బర్డ్‌ఫ్లూవ్యాధిగూర్చి అవగాహన కల్పిం చడం మాత్రమేకాక సలహాలు, సూచనలు ఇవ్వాలి. గ్రామాల వారిగా ప్రజలను చైతన్యం చేయాలి.

నాణ్యమైన వైద్యం అందించాలి:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

విస్తరిస్తున్న ప్రజావసారాలకుతగినట్లు స్వయంప్రతిపత్తి కలిగిన అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థలను దేశంలో ఏడు రాష్ట్రాలలో ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరిలో 2018 సంవత్సరంలో ప్రారంభించాలని లక్ష్యాలను నిర్దేశించారు.2021నాటికి మరొక ఎనిమిది సంస్థలను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపించడం, స్థానిక సమస్యలు,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలమధ్య సమన్వయం లోపిం చడం వలన కొత్త ఎయిమ్స్‌కు సంబంధించి పనులు వేగంగా సాగడం లేదు. భూమిసేకరణ,నీటి వనరుల సేకరణ, కొత్తభవ నాల నిర్మాణం, విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మాణం వంటి పనులు ముందుకు సాగడం లేదు.

ప్రైవేట్‌ ఉపాధ్యాయులను ఆదుకోవాలి: -కె.నారాయణరావు, హైదరాబాద్‌

తెలంగాణరాష్ట్రంలో లాక్‌డౌన్‌తో మూతపడిన విద్యాసంస్థ లలో పనిచేస్తున్న వేలాది మంది ప్రైవేట్‌ టీచర్లను ప్రభు త్వం తక్షణం ఆదుకోవాలి. ఉపాధి కోసం దినసరి కూలీలు గా ఉపాధ్యాయులు మారడంనిజంగా బాధాకరమే. విద్యా సంస్థలు మూతబడ్డాక సగం కంటే తక్కువ సిబ్బందితో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తూ మిగితా సిబ్బందికి జీతాలు చెల్లించడం మానేశాయి.ఆన్‌లైన్‌ క్లాసులలో పాఠాలు చెబు తున్న టీచర్లకు60శాతం మాత్రమే జీతాలు చెల్లిస్తూ అధిక లాభాలను మూటగట్టుకోవడం దారుణం.

చుక్కలనంటిన ధరలు: -కామిడి సతీష్‌రెడ్డి, భూపాలపల్లి జిల్లా

రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటా యి. మరో నాలుగు రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తూ ఉండ టంతో ప్రతి ఇంటిలో ఆనవాయితీ ప్రకారం పిండి వంటలు చేసుకోవడం సంప్రదాయంగా వస్తూ ఉంది. పిండి వంటలకి కావాల్సిన సామాగ్రి ధరలు చూసి ప్రజలు షాక్‌కి గురి అవ్ఞ తున్నారు.నూనెల ధరలుఅమాంతం పెరిగినాయి.నూనె పాకెట్‌ ధర 140 రూపాయాలకు చేరుకుంది. పప్పులు, బెల్లం, నువ్ఞ్వ లు, చక్కెర, మిగతా నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారి పెరగడంతో సామాన్యులు పేదవర్గాల వారు ఈ సారి పిండి వంటలు చేసుకోవడం కష్టంగా మారింది. పెరిగిన ధరలతో పండుగ జరుపుకోవడానికి వెనుకడుగువేసే సందర్భాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెరిగిన నిత్యావసర వస్తువ్ఞల ధరలు తగ్గించాలి.

పెరుగుతున్న నేరాలను అరికట్టాలి:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరు జిల్ల్లా

జాతీయ నేరగణాంకాల సంస్థ వివరాల ప్రకారం దేశంలో ప్రతి పదిహేను నిమిషాలకొక మహిళపై అఘాయిత్యం చోటు చేసు కుంటోంది.అయితే ఈ అత్యాచార కేసులలో శిక్షలు పడేందుకు మాత్రం సగటున10-12సంవత్సరాలు పడ్తొంది. విచారణపూర్త యి, ముద్దాయిలను కోర్టులలో ప్రవేశపెట్టేందుకే ఆరునెలల సమయం పడ్తుండగా పకడ్బందీ సాక్ష్యాలు సేకరించలేని కార ణంగాకేవలం30శాతం కేసులలో మాత్రంశిక్షలు ఖరారై మిగితా 70 శాతం కేసులలో దోషులు హాయిగా శిక్షల నుంచి తప్పించు కుంటున్నారు.ఇలాంటివారే ఏచట్టాలు తమని ఏం చేయలేవన్న ధీమాతో తిరిగి అత్యాచారాలకు తెగబడుతున్నారు. నిర్భయ ఘటన నేపథ్యంలో ఏర్పాటైన జస్టిస్‌ వర్మ కమిటీ పోలీసులు, న్యాయవ్యవస్థ పనితీరును మెరుగుపర్చేందుకు ఎన్నో కీలక సిఫార్సులు చేయగా అవిఇంకా వెలుగుచూడనే లేదు.

నగరాన్ని మరింత అభివృద్ధిపరచాలి:-షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ప్రపంచంలోనే గర్వించదగ్గ నగరం హైదరాబాద్‌. ఆసియా ఖండంలో అత్యంత గొప్ప ఆదరణ ఉన్న నగరం హైదరా బాద్‌. విభిన్న మత సంస్కృతులు నివసించే వారు ఉన్న నగరం హైదరాబాద్‌.అలాంటి హైదరాబాద్‌ ఇంకా అభి వృద్ధి చెందాలి. ప్రతి బస్తీ, ప్రతి కాలనీ అభివృద్ధి కావాలి. హైదరాబాద్‌ ఇంకా అభివృద్ధి చెంది, ప్రపంచం నలుదిక్కులా హైదరాబాద్‌ ఖ్యాతి విస్తరించాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/