ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

అనుమతులు మంజూరు చేయాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

తెలుగు రాష్ట్రాల్లో చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ జాతీ య రహదారుల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సత్వరమే అనుమతులు మంజూరు చేయాలి.

కల్వకుర్తి నుండి కర్నూలు జిల్లా వరకు 122 కి.మీ జాతీయ రహదారి పూర్త యితే హైదరాబాద్‌, తిరుపతిల మధ్య 100 కి.మీ దూరం కలిసివస్తుంది.

కడప నుండి రేణిగుంట వరకు నాలుగులైన్ల రహదారి విస్తరిస్తే హైదరాబాద్‌-తిరుపతి -చెన్నైలను అను సంధానం చేసే ఈ రహదారిపై ప్రయాణం నాలుగు గంటలు కలిసివస్తుంది.

కడపజిల్లా సిద్ధపట్నం నుండి రైల్వే కొడూరు వరకు విస్తరణ పనులు, కడప నుండి రేణిగుంట వరకు, బుద్వేల్‌ నుండి కృష్ణపట్నం వరకు కొత్త జాతీయ రహదారులు గత అయిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.

బస్సుల కొరతను అధిగమించాలి:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

తెలంగాణాలో ఆర్టీసీలో బస్సుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పాత బస్సులను తిప్పడం వలన ప్రయాణికులకు ఎంతో అసౌకర్యంగా ఉంది.

అధ్వాన్నం గా ఉన్న రోడ్ల వలన ఇబ్బందులు మరింత ఎక్కువవుతున్నాయి. అంతరాష్ట్ర సర్వీసులలో కూడా కాలం చెల్లిన బస్సులు నడపాల్సిన దుస్థితి ఇప్పుడు నెలకొంది.

బస్సులకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం, కాంట్రాక్ట్‌ డ్రైవర్ల నిర్లక్ష్యం, తర చుగా పెంచేస్తున్న ధరల వలన రాష్ట్రంలో బస్సుప్రయాణం సంకటంగా మారింది.

అలాగే రాష్ట్రంలో సింహభాగం బస్సు షెల్టర్లు అధ్వాన్నస్థితిలో ఉండటం వలన ఎండా,వర్షాకాలంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

గ్రామీణుల బతుకులు అస్తవ్యస్తం: – ఎన్‌.రాధాకృష్ణ, గుంటూరు జిల్లా

ముంపు గ్రామాల ప్రజల బతుకులు ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి కారణంగా అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

ప్రాజెక్టు కోసం వేలాది ఎకరాలు ప్రభుత్వానికి స్వచ్ఛం దంగా అప్పగించి పునరావాస కేంద్రాలకు తరలిపోయిన వేలాది రైతులు గ్రామస్థులు ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు అధికారిక గెజెట్‌ నోటిఫికేషన్‌ వెలువడక పోవడం, పునరావాస కేంద్రాలలో కనీససౌకర్యాలకు రూపకల్పన జరగకపోవడం తో ప్రజలు నిత్యం ఆందోళనలకు గురవుతున్నారు.

ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాలి.

నిబంధనలను పాటించాలి: -ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరు జిల్లా

దేశంలో కరోనా రికవరీ రేటు గణనీయంగా పెరగడం శుభకర పరిణామం.

అయితే కరోనా పూర్తిగా తొలగిపోయేంత వరకు ప్రజలు ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్దేశిత ప్రమాణాలను, భద్రతా చర్యలను తప్పక పాటించాలన్న ప్రధాని సూచన ఎంతో సమయోచితం.

దేశంలో నెలకొన్న పండుగ వాతావరణంలో ప్రజలు ఏమరపాటుగా ఉంటే తిరిగి కరోనా కేసులు పెరగడం సాధ్యం. ప్రపంచంలో రెండో వేవ్‌గా కరోనా కేసులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు వహిం చాలి.

అయితే కరోనా అన్‌లాక్‌-5 తర్వాత బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాలలో ఉప ఎన్నికలు వంటి కార్యకలా పాలు ప్రారంభమయ్యాయి.

వీటివలన కరోనాకేసులు పెరిగే అవకాశం ఉంది. ఎన్నికలు వాయిదా వేయలేకపోతే నిబం ధ నలను కట్టుదిట్టంగా అమలుచేయాలి.ప్రజలను సమీకరించడం, సామూహిక ఉత్సవాలు, ర్యాలీలు వంటి వాటిని నిషేధించాలి.

మూఢనమ్మకాలను నిర్మూలించాలి: – కొల్లు విజయలక్ష్మి, వరంగల్‌

శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినా మూఢనమ్మకాలు మన సమాజంలో ఇంకా రూపు మాయకపోవడం దురదృష్టకరమనే చెప్పాలి.

మంత్రగాళ్లన్న నెపంతో హత్య లు, సజీవ దహనాలకు పాల్పడుతుండటం అమానుషం. బాబా లు, స్వామీజీలను కూడా దండిస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి.

నిరక్షరాస్యులైన ప్రజల్లో చైతన్యం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

ఇతరుల మీద కక్ష తీసుకోవటానికి మంత్రగాడని ముద్రవేసి హత్యలకు పాల్పడుతున్న సంఘటన లు లేకపోలేదు. పోలీసులు వీటిపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరముంది.

ప్రభుత్వం పల్లెలో సాంస్కృతిక బృందాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలి.

ఓటు కోసం-సీటు కోసం: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న ఎన్ని కలలో ఓటమి చెందుతున్నపార్టీల నాయకులు ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు.

పాదయాత్రలు చేస్తూ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అన్ని చోట్ల సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

పాద యాత్రలతో ప్రచార హోరుతో షెడ్యూల్‌, నోటిఫికేషన్ వెలువడకముందే గ్రేటర్‌లో హడావుడి చేసేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/