ప్రజావాక్కు…

స్థానిక సమస్యలపై ప్రజల లేఖలు

Voice ot the people
Voice ot the people

అసంబద్ధ విధానాలకు పరాకాష్ట: -గరిమెళ్ల భారతీదేవి, ఏలూరు, ప.గోజిల్లా

రాష్ట్రప్రభుత్వం గూడు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి నలభై గజాల స్థలాన్ని కేటాయించాలనీ, అందు కు అవసరమైన భూసేకరణకు అధికార యంత్రాంగం మొత్తా న్ని మోహరించడం,ఆపైన భూసేకరణ ప్రక్రియ వివాదాస్పం దంగా మారుతున్న వైనాలు నిత్యం పత్రికలలో వస్తున్నాయి.

అసలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వేలాది గృహాలను పూర్తి చేయకుండా ఇళ్లస్థలాల పంపిణీఅనాలోచిత నిర్ణయమనే చెప్పా లి.ఆపైన ఆస్థలాలను తాకట్టుపెట్టుకోవడానికి ఐదు సంవత్స రాలతర్వాత అమ్మకానికి వెసులుబాటుకల్పించడం సరైన విధా నంకాదు.

గతంలోకూడా ఇలాప్రభుత్వాలు కేటాయించిన స్థలా లు పేదలదగ్గర నుండి కండబలంకలిగిన నేతల హస్తగతమైపో వడంచూశాం.ఇప్పుడు కూడా పాలకుల రాజకీయ ప్రయోజనం తప్పితే పేదల గృహ సమస్యకు పరిష్కారం లేదు.

ఈ ఇళ్ల స్థలాల పంపిణీ పథకంలో సామాజిక న్యాయం, ప్రయోజనం కంటేఅక్రమాలే అధికంగాఉన్నాయి.వారికి సకల సదుపాయాల తో గృహాలు నిర్మించి, తిరిగి అమ్మకానికి వీలు లేని విధంగా నిబంధనలను రూపొందించడమే సరైన విధానం.

భూగోళాన్ని చల్లబర్చుదాం: -సయ్యద్‌ షఫీ, హన్మకొండ

వాతావరణ పరీరక్షణ గూర్చి మాట్లాడే ప్రతి ఒక్కరూ ఇటీవలే భూగోళం వేడెక్కడం గురించి ప్రస్తావిస్తారు. దీనికి కారణం మానవతప్పిదాలు.ప్రకృతి వనరులను నిరుపయోగం చేయడం వల్ల ఈ ముప్పురోజురోజుకు పెరుగుతుంది. మానవ జాతి మనుగడకు ప్రమాదం వాటిల్లే స్థితి ఏర్పడుతుంది. వాతావర ణంలోని కొన్ని వాయువ్ఞలు కారణంగా భూగోళం వేడెక్కుతుం ది. మనుషులు వదిలిన కార్బన్‌ డై ఆక్సైడ్‌, వాహనాలు విడు దల చేసే కార్బన్‌ మోనాక్సైడ్‌, ఫ్యాక్టరీలు, మిథేన్‌ నైట్రేన్‌ ఆక్సైడ్‌,మొదలగు వాయువ్ఞలు భూమి ఉపరితలంపై ఏర్పడ్డం వల్ల వేడిని వెలుపలికి వెళ్లనీయకుండా అడ్డుకోవడం వల్ల భూమి వేడెక్కుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పుట్టగొడుగుల్లా పొదుపుసంఘాలు:-షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని చాలా పొదుపు సంఘాలుపుట్టగొడులుగా ఏర్పడుతున్నాయి.అధిక వడ్డీలు ఇస్తా మని ఆశచూపి ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డిపాజిట్‌లు సేకరిస్తున్నారు.అలాగేమున్ముందు సామాన్యప్రజలకు రుణాలు బాగా మంజూరు చేస్తారు. మళ్లీ రుణం కోసం దరఖాస్తు చేసు కుంటే, రుణాలు మంజూరు చేయడంలో ఆలస్యం చేస్తారు.

సమస్యల వలయంలో ఆంధ్రప్రదేశ్‌: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

ఏడాదంతా కష్టపడి చదివిన ఇంటర్‌, పదో తరగతి విద్యార్థుల భవితవ్యం తెలిపే వార్షిక పరీక్షలు, రిజర్వేషన్లపై బిసిల వాటా కుదింపుపై న్యాయస్థానాల్లో ఆయా వర్గాల కేసులు, ప్రచార సభల వల్ల కరోనా వైరస్‌ ప్రబలే ప్రమాదం, వార్డు రిజర్వేష న్లలో అవకతవకలు, కులధ్రువీకరణ పత్రాల మంజూరుకు సమ యం లేకపోవడం, ఉభయ గోదావరి జిల్లాల్లో కలిసిన ముంపు మండలాలతోపాటు నగర పాలక సంస్థల్లో విలీనం కాని గ్రామా లకు ఎన్నికలపై సందిగ్ధత, ఎన్నికల సంఘం అభ్యంతరం తెలి పినా సచివాలయాలకు అధికారపార్టీ రంగులు తొలగించకపోవ డం,ఇటువంటి సవాలక్ష సమస్యలసుడిగుండంలో ఆంధ్రప్రదేశ్‌ స్థానికసంస్థల ఎన్నికలు జరుగుతాయా?

ఇసుకపై సాము గరిడీలు?: -ఆర్కే, ముస్తాబాద, గన్నవరం, కృష్ణాజిల్లా

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరా, పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖకు అప్పగించాలని నిర్ణయించడం వలన విని యోగదారులకు మరిన్ని చిక్కులుతప్పిస్తే ఒరిగేది శూన్యం! ఇప్ప టికే రెవెన్యూ, గనులశాఖ, పోలీసు శాఖల అవినీతితో ఇసుక బ్లాక్‌మార్కెట్‌కు పెద్దఎత్తున తరలిపోతున్నది.ఇక వీటికి మరో శాఖతోడైతే ఏమి జరుగుతుందో పాలకులు ఆలోచించాలి. అస లు మంత్రులే ఇసుక ఇతరరాష్ట్రాలకు తరలిపోవడంపై విస్తుపో తున్నారు. ఇసుక దందా అంతా స్థానిక నేతల కనుసన్నలతోనే నడుస్తున్న యధార్థాన్ని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. పదేపదే ఇసుక అక్రమ తరలింపును అరికట్టాలని ఆదేశాలివ్వడం, పలు శాఖలకు బాధ్యతలు అప్పగించడం వలన ప్రజల్లో పాలకులకు అధికార యంత్రాంగంపై పట్టులేదన్న భావన కలుగుతుంది.

బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు మొండిచేయి: -శ్రవణ్‌కుమార్‌, కందగట్ల

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన విశ్వవిద్యాలయానికి నిధుల కేటాయింపు ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పుడు కేటా యించిన నిధులుకేవలంఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతున్నా యి.ఇంకా అభివృద్ధికి ఎలా సరిపోతాయి. ఉస్మానియా యూని వర్శి టీకి కేవలం జీతాలకే నెలకు ముప్పై కోట్ల రూపాయలు అవ్ఞతుంటే సుమారు వెయ్యి కోట్ల ప్రతిపాదన అవసరం. కానీ ప్రభుత్వం కేటాయించింది343కోట్లు మాత్రమే.తెలుగు యూని వర్శిటీకి సార్వత్రిక యూనివర్శిటీకి,కాకతీయ యూని వర్శిటీకి కలిపి300కోట్లకి ప్రతిపాదనలు పంపినాకేవలం 88.28 కోట్లకి సరిపెట్టడం వల్లపూర్తిస్థాయి అభివృద్ధి జరగకపోవచ్చు.

తాజా స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/