ప్రజావాక్కు: సమస్యలపై గళం

Voice of the People
Voice of the People

సిపిఎస్‌ను రద్దు చేయాలి:-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

అధికారం చేపట్టి నెలరోజుల లోపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు లకు కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సి.పి.ఎస్‌) రద్దు చేస్తామని, ప్రభుత్వ ఖాళీలు పూరిస్తామని ఎన్నికలప్రణాళికలో జగన్‌ ప్రక టించారు.ఎనిమిదినెలలు దాటినా ఆ సమస్యలపై దృష్టి సారిం చకపోవడం బాధాకరం. ఈ వాగ్దానంతో నిరుద్యోగ, ఉద్యోగి వారి కుటుంబ సభ్యులు అధికారం చేపట్టడానికి ఎన్నో రకాలు గా కృషి చేశారు. త్రిపుర, పశ్చిమబెంగాల్‌, కేరళలో సిపిఎస్‌ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉండగా పూర్తి గ్రాడ్యూటీ చెల్లింపునకు పచ్చజెండా ఊపారు.ఏరుదాటాక తెప్ప తగలపెట్టడం సరైనదికాదు.ఎన్నికల్లో చెప్పిన వాటికంటే ఎక్కు వ అమలుచేశానని బహిరంగంగా చెప్పుకుంటున్న జగన్‌ ప్రభు త్వం సిపిఎస్‌ వెంటనే రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకోవాలి.

ఏది రాజమార్గం?: -బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

దేశాధ్యక్షుడికి రాజ్యాంగం ప్రసాదించిన క్షమాభిక్ష అధికారాన్ని సవాలు చేయవచ్చా? దానిని సమీక్షించే అధికారం కోర్టులకు ఉందా?అని నిర్భయదోషుల కేసులోసాగుతున్న సాగుడు వ్యవ హారాన్ని గమనిస్తున్న ప్రజల బుర్రల్ని తొలిచేస్తున్న సందేహం! ఉంటే దేశాధ్యక్షుడికి విశేషాధికారం ఉన్నట్టా? లేనట్టా? అదే దేశాధ్యక్షుడు ఒక దోషికి క్షమాభిక్ష అనుగ్రహించిన పక్షంలో దానికి కోర్టులో సవాలు చేయవచ్చునా! కోర్టుకు దానిని సమీ క్షించే అధికారం ఉందా? ఇది ప్రజల్ని వెన్నంటే వేధిస్తున్న ప్రస్తుత సమస్య. నిర్భయ దోషుల ఉరిశిక్షలు ప్రజల్ని, సమా జానికి ఒక పీడలా పరిణమించింది.అసలు న్యాయం రాజ మార్గంలో సాగుతోందా?

సత్వర న్యాయమే సరైన పరిష్కారం: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

శ్రీఘతర,సత్వర న్యాయం కోసం కృషిచేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి పిలుపు నివ్వడం శుభపరిణామం. ఇందుకోసం న్యాయవ్యవస్థలో విప్లవాత్మకసంస్కరణలకు సుప్రీంకోర్టునడుం కట్టడంఆనందదాయకం.న్యాయపాలికపనిదినాలను పెంచడం, కోర్టులనిర్వహణను మెరుగుపరచి, అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానం వినియోగ మార్గాన్ని సుగమనం చేయడం, అన్ని కోర్టు లలో ఉన్న రమారమి మూడువేల ఖాళీలను పూర్తిచేయడం, వేసవి సెలవ్ఞలో విరామకాల బెంచ్‌ల ఏర్పాటు, కోర్టు పని గంటల్ని రోజుకు ఒక గంట పెంచడం, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు, పెండింగ్‌ కేసులను పరిష్కరించడం వంటి చర్యలకు సుప్రీంకోర్టు శ్రీకారం చుట్టడం మంచి పరిణామం.

ఖర్చులు రాబట్టాలి:-గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

రాష్ట్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయటాన్ని తప్పుపడుతూ ఆ వేసిన రంగులను వెంటనే తుడిచివేయమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం. ఒక్క పంచాయతీ కార్యాలయాలకే కాకుండా మంచినీటి సరఫరా టాంకులు, విద్యుత్‌ స్తంభాలు, గ్రామాల్లోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అధికార పార్టీ రంగులు ఇంకా వేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయా లకు పార్టీల రంగులు వేయడం చాలాతప్పు అని సామాన్యులు సైతం మొత్తుకుంటున్నా పాలకులు పెడచెవిన పెట్టారు. అలా రంగులు వేయటానికి దాదాపు పధ్నాలుగు వందల కోట్ల రూపా యలు ఖర్చుపెట్టినట్లు పత్రికలలో వార్తలు వస్తున్నాయి. మరి వాటిని తుడిచివేయడానికి ఇంకా ఎక్కువ ఖర్చే అవ్ఞతుంది. ఈనేపథ్యంలో అలా రంగులు వేయడానికి బాధులైన వారి నుండి ఆ ఖర్చును రాబట్టాలి.

నాయకుల తీరు మారాలి:-కాయల నాగేంద్ర, హైదరాబాద్‌

రాజకీయ నాయకుల ఉత్తమ ప్రసంగం అంటే వారి మాటలు నాభిలోంచి రావాలి. ఆవేదన మనసులోంచి ఉప్పొంగాలి. విశ్లే షణ బుద్ధిలోంచి ఊపిరి పోసుకోవాలి. విమర్శలు సహేతుకంగా ఉండాలి. కానీ నేడు చట్టసభల్లో సభ్యుల ప్రసంగాలు అందుకు విరుద్ధంగా వినిపిస్తున్నాయి.కనిపిస్తున్నాయి. సభ్యుల ప్రసంగా లుప్రజాసమస్యలు,అవినీతి,జలవివాదాలు, భూకేటాయింపులు, అట్టడుగు వర్గాల కష్టాలు ఇలా జనజీవనంతో ముడిపడిన అనే క అంశాలమీద గళంవిప్పాలి. కానీ నేడు అలా జరగడం లేదు. వారు మాట్లాడుతున్న భాషపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్నా వారి పద్ధతి మాత్రం మారడం లేదు. ఎదుటివారిని దూషించడంలో తన స్థాయినే మరిచిపోతున్నారు. నాయకులు ఏ పార్టీ వారైనా సరే వ్యక్తిగత దూషణలకు స్వస్తి పలకాలి.

పెరుగుతున్న నేరాలు: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

జాతీయ నేరాల నమోదు సంస్థ తాజా నివేదిక ప్రకారం విద్యు ద్ఘాతం, అగ్నిప్రమాదాలు, ఎల్‌.పి.జి సిలిండర్ల పేలుడు వంటి దుర్ఘటనలలో మరణించిన వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో గత అయిదేళ్లలో 19 శాతం పెరగడం ఆందోళన కలిగించే అంశం. గోడ,భవనాలు కూలడం,వడదెబ్బ,పిడుగుపాటు, విష ఆహారం వంటి దుర్ఘాటనలో మరణించే వారి సంఖ్యలో 18శాతం పెరగ డం, తెలుగురాష్ట్రాలలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవా ల్సినఅవశ్యకత తెలియచేస్తున్నాయి.క్షతగాత్రులను సమీప ఆస్ప త్రులకు తరలించడంలో విపరీతమైన జాప్యం కలుగుతోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/