ప్రగతి భవన్‌లో సమావేశం ముగిసింది

TS CM KCR
TS CM KCR
హైదరాబాద్: ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్‌లో గట్టిగా పట్టుబట్టాలని ఆదేశించారు. నరేగాను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసేలా కోరాలని ఎంపీలకు కేసీఆర్ తెలిపారు.. ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు మనమే గెలవాలని టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ సూచించారు.ఈ సందర్భంగా ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మొత్తం 50కిపైగా అంశాలపై చర్చించాం. పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులను కలుస్తాం. బైసన్ పోలో గ్రౌండ్‌ స్థలం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం.’’ అని అన్నారు.