హాస్పటల్ లో కనిపించిన ప్రభాస్..కారణం ఏంటో…?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు సంబదించిన ఏ చిన్న విషయం కానీ, ఏ చిన్న వీడియో కానీ బయటకు వస్తే అది వైరల్ కావాల్సిందే. తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఒకటి , రెండు , కాదు ఏకంగా మూడు పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. వీటి షూటింగ్ కూడా సగం వరకు వచ్చాయి. కానీ వీటికి సంబదించిన ఎలాంటి అప్డేట్స్ మాత్రం రావడం లేదు. దీంతో అభిమానులు ఆయా మేకర్స్ ఫై విపరీతమైన కోపంతో ఉన్నారు.

ఆదిపురుష్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తోందేమో అని ఈ ఏడాది ప్రారంభం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు అభిమానులు. శ్రీరామనవమి, ఉగాది ఇలా పండుగలు వెళ్తూనే ఉన్నాయి. కానీ అప్డేట్ మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఓ హాస్పిటల్‌లో ప్రభాస్ అలా నడిచి వస్తోన్న వీడియో వైరల్ అవుతోంది. అది కొందరు పాత వీడియో అని అంటే.. కాదు కాదు అది కొత్త వీడియోనే అని ఇంకొందరు అంటున్నారు. ప్రభాస్‌కు ఏమైందని కొందరు అంటే.. కృష్ణంరాజును చూసేందుకు హాస్పటిల్‌కు వెళ్లాడని ఇంకొందరు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఏదో ఒకటి ప్రభాస్ ఈ విధంగానైనా కనిపించాడని మరికొంతమంది అభిమానులు అంటున్నారు.