ప్రభాస్ యూకే లో చికిత్స తీసుకుంటున్నాడా..?

Hero Prabhas
Hero Prabhas

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యూకే లో ఉన్నాడా..? చికిత్స కోసం అక్కడికి వెళ్లాడా..? ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి రాధేశ్యామ్. రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చూస్తున్నారు. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే ఆదిపురుష్ , సలార్, నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ మొదలుపెట్టాడు. ఇవే కాక దిల్ రాజు బ్యానర్ లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

అయితే ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ కనిపిస్తున్నాడు. శ్రీరాముడి రోల్ విషయంలో దర్శకుడు ఓంరౌత్ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లుక్ పరంగా కంటిన్యూటీ మిస్ కాకుండా జాగ్రత్త పడాల్సిందిగా ప్రభాస్ కి చెప్పాడట. దీంతో ప్రభాస్ శరీరంలో ఇటీవల కొన్ని మార్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతన్నాయని దీంతో యూకే లో ని వరల్డ్ క్లాస్ డాక్టర్ – డైటీషన్ వద్దకు పంపించి అత్యుత్తమ చికిత్స చేయించాలని నిర్ణయించారట. ప్రభాస్ ఆ పనిలో ఉన్నారని ..అందుకే యూకే కి వెళ్లాడని అంటున్నారు. మరి ఇది నిజామా కదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.