విశ్రాంత ఉద్యోగుల ఫించన్ కోతపై విచారణ వాయిదా
మూడు రోజులలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచన

అమరావతి: ఏపిలో లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే విశ్రాంత ఉద్యోగుల పించన్‌లో యాభైశాతం కోత విధిస్తు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని నేడు ధర్మాసనం విచారించింది. పెన్షనర్లకు అదే ఆధారమని , వారి పింఛన్ లలో కోత విధించడం అన్యాయమంటు న్యాయవాధి జంధ్యాల రవిశంకర్ పిటిషన్ ధాఖలు చేయగా.. దీనిపై న్యాయస్థానం, ముడు రోజులలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/