బాలింతల ఆహారం: కోడిగ్రుడ్లు, ప్రోటీన్స్
చికెన్, మాంసం ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

కోడిగ్రుడ్లు, చేపలు, పాలు,లివర్,చికెన్, మాంసం, రెడ్‌మీట్, బీఫ్, గింజలు, పప్పు పదార్థాలు, బీన్స్, బఠాణీలు, వంటి ప్రోటీన్స్ వున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
కార్బోహైడ్రేట్స్‌వున్న పిండి పదార్థాల్ని తక్కువగా తీసుకోవడం మంచిది.
దీనివల్ల గ్యాస్ తయారీ ఎక్కువయ్యే అవకాశ ముంది. క్రొవ్వుపదార్థాలు, నెయ్యి, వెన్న, మీగడ, పెరుగు, జున్ను వల్ల చంటిపిల్లల్లో బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది. కంటి చూపు బాగా వుంటుంది.
తల్లిపాల వల్ల ఇమ్యూనిటీ డెవలప్ అయి ఇన్ఫెక్షన్స్ రావు. శారీరక, మానసికఎదుగుదల బాగా ఉంటుంది.
ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిలోని ఫైబర్, ప్రోటీన్స్ వల్ల అధికఆకలి కాదు. మలబద్దకం జీర్ణక్రియ లోపాలేర్పడవు.
ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల కొందరిలో విరేచనాలు అవుతాయని బాలింతలకి ఆకుకూరలు పెట్టరు, కాని సోయాకు, మెంతాకు, సిర్రాకు, పాలకూర, బ్రొకోలీ, క్యారెట్, బీట్‌రూట్,ముల్లంగి వాడవచ్చు. ఐరన్ బాలింతల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది
కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉన్న ఖర్జూరాలు, డ్రైఫ్రూట్స్,బెల్లం, తేనే, పాలు, గోంగూర,చేపలు, మాంసం,చికెన్ వంటివి తీసుకోవడం వల్ల ఐరన్ శాతం ఎక్కువై రక్తాభివృద్ధి జరుగుతుంది.
గర్భధారణలో ముందే ఐరన్ శాతం తక్కువగాఉంటుంది. ప్రసవ సమయంలో,ప్రసవం తర్వాత కల్గే రక్తస్రావాల వల్ల, బాలింతల్లో బహిస్టులు నెలనెల రావడం వల్ల కూడా ఐరన్ తగ్గిపోయి రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల క్షీరాభివృద్ది తగ్గుతుంది.
కాబట్టి గర్భధారణ నుండి కాన్పు అయి న 6నెలల వరకు ఐరన్, ఫోలిక్ ఆసిడ్, కాల్షియం మాత్రల్ని ఆహారంతోపాటు సప్లిమెంట రీగా వాడాల్సివుంటుంది.
ఐరన్‌లోపం దిగువ, మధ్యతరగతి స్త్రీలలో ఎక్కువగా ఉంటుం ది. వీటిలోని థైలాకాయిడ్స్ వల్ల బరువు పెరగరు. శరీరసౌష్టవం వృద్ధి చెందుతుంది.
పండ్లు- కొందరికి సిట్రస్ ప్రూట్స్ – నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష వంటి పుల్లని పండ్లు పడక పోవచ్చు. కాని ఆరోగ్యానికి కాన్పు సమయంలో కలిగే చీలికలు, ఆపరేషన్ కోతలు త్వర గా నయం అవుతాయి. వీటిలోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
అరటి, ఆపిల్, దానిమ్మ, జామ, ఉసిరి రసం, బొప్పాయి వంటి అన్ని రకాల పండ్లు, పండ్ల రసాల్ని తగుమోతాదులో వీలైతే ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ తీసుకోవచ్చు.
ఆల్మండ్స్, బాదం, పిస్తా, డ్రైఫ్యూట్స్, రాగిమార్ట్, నువ్వులు, బార్లీ ,ఓట్స్, స్వీట్‌కార్న్, గోధుమ, బ్రౌన్‌రైస్, మెంతులు తీసుకోవాలి. ఉప్మా, ఓట్స్, బ్రెడ్‌పాలలో కలుపుకొనితినడం, వెజిటబుల్ కిచిడీ, ఇడ్లీ తీసుకోవడం మంచిది. పాలలో పసుపు వేసుకొని త్రాగడం అన్నివిధాలా మంచిది.
పసుపులో బి6,విటమిన్ సి, కె, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్, కుర్కుమిన్ ధాతువుండడం వల్ల ఆంటిసెప్టిక్‌గా పనిచేయడంతో ఇన్ఫెక్షన్స్ రాకుండా అరికడుతుంది.
డైరీప్రొడక్ట్స్ పాలు, వెన్న, నెయ్యి,ఎంత బాగా తీసుకుంటే అంతమంచిది.
తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/devotional/